Hyderabad: ఐటీ సిటీలో యూత్‌కి పోలీసుల జలక్.! సాఫ్ట్‌వేర్ జోన్‌లో మారిన ట్రాఫిక్ రూల్స్!

హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్లు వాడితే ఇకపై సీరియస్ యాక్షన్.

Hyderabad: ఐటీ సిటీలో యూత్‌కి పోలీసుల జలక్.! సాఫ్ట్‌వేర్ జోన్‌లో మారిన ట్రాఫిక్ రూల్స్!
Traffic Rules
Follow us
Ranjith Muppidi

| Edited By: Balaraju Goud

Updated on: Oct 26, 2024 | 9:07 PM

హైదరాబాద్ మహానగరం సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి చేపట్టిన ముఖ్యమైన పథకాలలో, ముఖ్య కూడళ్లలో కొత్త సిసిటివి కేమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

త్వరలో మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపరేషన్ల నిర్వహించాలని హైదరాబాద్ పోలీసులు ఫ్లాన్ చేశారు. ఇకపై డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ తెలిపారు. అక్రమ పార్కింగ్ స్థలాలను గుర్తించి, నో-పార్కింగ్ బోర్డులు పెట్టడంతోపాటు, ఈ ప్రాంతాలలో చలాన్ లు వేసి తగు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎక్కువ రద్దీ ఉన్న సమయాలను, ప్రాంతాలను గుర్తించి సీరియస్ యాక్షన్‌కు రెడీ అవుతున్నారు పోలీసులు.

మరోవైపు రహదారులు విస్తరణ,మరమ్మతు పనులు యథావిధిగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్లు వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మరీ ముఖ్యంగా అధిక వేగం, హెల్మెట్ వినియోగం, మైనర్ డ్రైవింగ్ నిరోధానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. పద పదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు వంటి శిక్షలను అమలు చేయనున్నారు.

మరోవైపు బైక్ రేసర్లపై స్పెషల్ నజర్ వేసినట్లు పోలీసులు తెలిపారు. వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ శివార్లలో బైకుల మోత మోగాల్సిందే..! ప్రతిసారి పోలీసులు హెచ్చరిస్తున్న కొందరు పోకిరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. బెట్టింగ్లు వేసుకుని మరి బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారు పలువురు యువకులు. తాజాగారాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 40 మంది బైక్ రేసర్లపై ఐదు కేసులు నమోదు చేసి, వారి 40 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీరు టి-హబ్, నాలెడ్జ్ సిటీ, రాయదుర్గం, సేరిలింగంపల్లి మండలం, రంగారెడ్డి జిల్లాలో గల ప్రాంతంలో పెద్దగా అరుస్తూ బైక్ రేసింగ్ చేసి భయానక వాతావరణం సృష్టిస్తూ ప్రజలకు అంతరాయం కలిగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న అన్ని వాహనాలను ట్రాన్స్‌పోర్ట్ ఆథారిటీకి అప్పగించి, మోటార్ వెహికల్ యాక్ట్ క్రింద చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..