భాగ్యనగర సిగలో డ‌బుల్ డెక్క‌ర్ కారిడార్‌.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

జంట న‌గ‌రాల‌తో పాటు ఉత్త‌ర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్ర‌జ‌లు, వాహ‌న‌దారుల ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం న‌డుంబిగించింది. జాతీయ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌)-44పై ద‌శాబ్ధాలుగా ఎదుర్కొంటున్న వాహ‌న‌దారుల క‌ష్టాల‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేప‌ట్ట‌నున్న 5.320 కిలోమీట‌ర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కండ్ల‌కోయ జంక్ష‌న్ స‌మీపంలో శ‌నివారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

భాగ్యనగర సిగలో డ‌బుల్ డెక్క‌ర్ కారిడార్‌.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Telangana Double Ducker Corridor
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 08, 2024 | 9:48 PM

జంట న‌గ‌రాల‌తో పాటు ఉత్త‌ర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్ర‌జ‌లు, వాహ‌న‌దారుల ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం న‌డుంబిగించింది. జాతీయ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌)-44పై ద‌శాబ్ధాలుగా ఎదుర్కొంటున్న వాహ‌న‌దారుల క‌ష్టాల‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేప‌ట్ట‌నున్న 5.320 కిలోమీట‌ర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కండ్ల‌కోయ జంక్ష‌న్ స‌మీపంలో శ‌నివారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై త‌ర్వాత మెట్రో మార్గం నిర్మించ‌నున్నారు. ఈ ర‌కంగా న‌గ‌రంలో తొలి డ‌బుల్ డెక్క‌ర్ కారిడార్‌కు నేడు నాంది ప్ర‌స్థానం ప్రారంభం కానుంది.

హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి, మెద‌క్‌, కామారెడ్డి, నిర్మ‌ల్‌-ఆదిలాబాద్ మీదుగా సాగే ఎన్‌హెచ్‌-44పైన జంట న‌గ‌రాల్లో విప‌రీత‌మైన వాహ‌న ర‌ద్దీతో న‌గ‌ర ప్ర‌జ‌లు, ప్ర‌యాణికులు నిత్యం ప‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్‌లో ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌, ఎలివేటెడ్ కారిడార్‌కు కంటోన్మెంట్ ప్రాంతంలోని నిబంధ‌న‌లు ఆటంకంగా మారాయి. స‌మ‌స్య ప‌రిష్కారానికి గ‌త పాల‌కులు చిత్త‌శుద్ది చూప‌క‌పోగా, వ్య‌క్తిగ‌త అహం, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా భావించ‌డంతో ర‌క్ష‌ణ శాఖ నుంచి అనుమ‌తులు సాధించ‌లేక‌పోయారు. 2019లో మ‌ల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఆ మ‌రుక్ష‌ణం నుంచే ఈ విష‌యంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్ష‌ణ శాఖ భూములు రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. పార్ల‌మెంట్‌లో ర‌క్ష‌ణ శాఖ స్టాండింగ్ స‌భ్యునిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ క‌మిటీ స‌మావేశాల్లోనూ కంటోన్మెంట్ ప్రాంతంలో ర‌హ‌దారుల విష‌యంలో ప్ర‌జ‌లు, వాహ‌న‌దారులు ప‌డుతున్న ఇబ్బందుల‌పై చ‌ర్చ‌ను కొన‌సాగించేవారు. ఇటీవ‌ల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం.. ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో ఈ అంశంపై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జ‌న‌వ‌రి అయిదో తేదీన స్వ‌యంగా క‌లిసి రాజధాని న‌గ‌రంలో కంటోన్మెంట్ ప్రాంతంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌ ర‌క్ష‌ణ శాఖ భూములు త‌మ‌కు అప్ప‌గించాల‌ని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వాల‌ని కోరారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తికి స్పందించిన ర‌క్ష‌ణ శాఖ ఎలివేటెడ్ కారిడార్ల‌ నిర్మాణానికి అంగీక‌రిస్తూ మార్చి ఒక‌టో తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ పంపింది. వెంట‌నే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలివేటెడ్ కారిడార్ల‌ నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టింది.

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇలా..

ఎన్‌హెచ్‌-44పై సికింద్రాబాద్‌లోని ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి మొద‌లై తాడ్‌బండ్ జంక్ష‌న్‌, బోయిన‌ప‌ల్లి జంక్ష‌న్ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు వ‌ద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడ‌వు 5.320 కిలోమీట‌ర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కిలోమీట‌ర్లు ఉంటుంది. అండ‌ర్ గ్రౌండ్ ట‌న్నెల్ 0.600 కి.మీ ఉంటుంది. మొత్తం 131 పియ‌ర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వ‌రుస‌ల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా బోయిన‌ప‌ల్లి జంక్ష‌న్ స‌మీపంలో ఇరువైపులా (0.248 కి.మీ. వ‌ద్ద‌), (0.475 కిలోమీట‌ర్ వ‌ద్ద‌) రెండు చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు. ఇది పూర్త‌యిన త‌ర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం నిర్మించ‌నున్నారు. ఫ‌లితంగా ఆ మార్గంలో ప్ర‌యాణం మ‌రింత క్షేమంగా, వేగంగా, సుఖ‌వంతంగా సాగ‌నుంది.

ఇవి కూడా చదవండి

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ప్ర‌యోజ‌నాలు..

ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యార‌డైజ్ జంక్ష‌న్ వ‌ద్ద రోజుకు స‌గ‌టున 1,57,105 వాహ‌నాలు (ప్యాసింజ‌ర్ కార్ యూనిట్ ఫ‌ర్ డే -పీసీయూ) ప‌య‌నిస్తుంటే, ఓఆర్ ఆర్ జంక్ష‌న్ స‌మీపంలో 72,687 వాహ‌నాలు ప‌య‌నిస్తున్నాయి. ఇరుకైన ర‌హ‌దారి కావ‌డం, ఇంత పెద్ద మొత్తంలో వాహ‌న రాక‌పోక‌ల‌తో నిత్యం వాహ‌న‌దారులు, ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు నిత్యం నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. త‌ర‌చూ ర‌హ‌దారి ప్ర‌మాదాల‌తో ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు. క్ష‌త‌గాత్రుల‌వుతున్నారు. అత్య‌వ‌స‌ర స‌మయాల్లో గ‌మ్యాన్ని చేరుకోలేక ప్ర‌యాణికులు తీవ్ర ఒత్తిడి, అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. వాహ‌న ర‌ద్దీతో గంట‌ల‌కొద్ది ట్రాఫిక్ నిలిచిపోతుండ‌డంతో ఇంధ‌నానిని భారీగా వ్య‌యం అవుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో స‌మ‌యం క‌లిసిరావ‌డంతో పాటు ఇంధ‌నంపై అయ్యే వ్య‌యం త‌గ్గుతుంది. ప్ర‌మాదాల సంఖ్య త‌గ్గిపోనుంది.

ముఖ్యాంశాలు..

  • మొత్తం కారిడార్ పొడ‌వు: 5.320 కి.మీ.
  • ఎలివేటెడ్ కారిడార్ పొడ‌వు: 4.650 కి.మీ.
  • అండ‌ర్‌గ్రౌండ్ ట‌న్నెల్: 0.600 కి.మీ.
  • పియ‌ర్స్: 131
  • అవ‌స‌ర‌మైన భూమి: 73.16 ఎక‌రాలు
  • ర‌క్ష‌ణ శాఖ భూమి: 55.85 ఎక‌రాలు
  • ప్రైవేట్ ల్యాండ్‌: 8.41 ఎక‌రాలు
  • అండ‌ర్‌గ్రౌండ్ ట‌న్నెల్‌కు: 8.90 ఎక‌రాలు
  • ప్రాజెక్టు వ్యయం: రూ.1,580 కోట్లు
  • ప్రాజెక్టుతో ప్ర‌యోజ‌నాలు:
  • జాతీయ ర‌హ‌దారి-44లో సికింద్రాబాద్‌తో పాటు ఆదిలాబాద్ వైపు జిల్లాల ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు తీరుతాయి.
  • ఆదిలాబాద్‌ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం
  • ఇంధ‌నం మిగులుతో వాహ‌ననదారుల‌కు త‌గ్గ‌నున్న వ్య‌యం
  • న‌గ‌రం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ ఆర్ వ‌ర‌కు చేరుకునే అవ‌కాశం
  • మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి-మెద‌క్‌-కామారెడ్డి-నిజామాబాద్‌-నిర్మ‌ల్‌-ఆదిలాబాద్‌కు ప్ర‌యాణికుల, స‌ర‌కు ర‌వాణా చేర‌వేత వేగంగా సాగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు