AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఆరా..

రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అధికార యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకోవడానికి సిద్దమైంది కేంద్ర ఎన్నికల సంఘం. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ బుధవారం సీఈవో కార్యాలయంలో విస్తృతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర బృందం చేస్తున్న కృషిని అభినందించారు.

Telangana: లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఆరా..
Telangana Elections
Srikar T
|

Updated on: Feb 07, 2024 | 7:37 PM

Share

రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అధికార యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకోవడానికి సిద్దమైంది కేంద్ర ఎన్నికల సంఘం. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ బుధవారం సీఈవో కార్యాలయంలో విస్తృతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర బృందం చేస్తున్న కృషిని అభినందించారు. ఇటీవల సమస్యలు ఎదుర్కొన్న ప్రాంతాలను అధికారులు గుర్తించి, వాటిని అధిగమించేందుకు వ్యూహాలు రూపొందించాలని సూచించారు.

తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలతో పాటు ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కేంద్ర ఈసీ సభ్యుడితో పలు అంశాలపై చర్చించి కొన్ని అంశాలపై వివరణ కోరారు. అదనపు సీఈవో లోకేష్ కుమార్, డీసీఈఓ సత్యవాణి, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, సంజయ్ జైన్ (ఐపీఎస్), మహేశ్ భగవత్ (ఐపీఎస్)తో పాటు ఇతర అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్నవారు నామినేషన్లు, ఓటు వేసే అంశంపై అనుసరించాల్సిన విధి విధానాలపై పలు సూచనలు చేశారు. కేంద్ర భద్రతా బలగాల అవసరంపై అంచనాలను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల నిర్వహణ కోసం ఐటీ అప్లికేషన్లు, ఇతర సాంకేతిక సంబంధిత వ్యవస్థలను పటిష్టం చేయాలని అధికారి రాష్ట్ర సీఈఓకు సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వెలుపల కూడా కొన్ని చోట్ల కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి

నగదు, ఇతర వస్తువుల అక్రమ తరలింపుపై చెక్ పెట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సీఈవో తరచూ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సీజ్ చేసిన వస్తువులపై సరైన రికార్డులు ఉన్నాయనే దానిపై ఈసారి ముందస్తుగా ప్రచారం కల్పించాలని, వాటిని ప్రజలు రీకలెక్ట్ చేసే విధానాన్ని సరళతరం చేయాలని సీఎంకు సూచించారు. వ్యాపార లావాదేవీల కోసం వ్యాపారులు నిత్యం తీసుకెళ్తున్న బంగారు ఆభరణాలు, మెటల్ విషయంలో తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి దానిని అనుకరించాలని సీఈవో రాష్ట్ర అధికారులకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..