Krishna waters: తెలుగురాష్ట్రాల లొల్లికి ఫుల్ స్టాప్..! కృష్ణా నీటి వాటా ఎంత..? వినియోగించాల్సిందెంత..? గెజిట్‌‌‌లో తేల్చేసిన కేంద్రం

కృష్ణా జలాల నీటి వినియోగం మీద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం డైరెక్షన్ ఇచ్చింది. ఇటీవల కొంత కాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన..

Krishna waters: తెలుగురాష్ట్రాల లొల్లికి ఫుల్ స్టాప్..! కృష్ణా నీటి వాటా ఎంత..? వినియోగించాల్సిందెంత..? గెజిట్‌‌‌లో తేల్చేసిన కేంద్రం
Gazette Notification
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 16, 2021 | 8:18 AM

Center Gazette ‌ Notification: కృష్ణా జలాల నీటి వినియోగం మీద తెలుగు రాష్ట్రాలకు కేంద్రం డైరెక్షన్ ఇచ్చింది. ఇటీవల కొంత కాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదానికి చరమగీతం అన్నట్టుగా ఒక్కో రాష్ట్రానికి నీటి వాటా ఎంత? వినియోగించాల్సింది ఎంత? అనే దానిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. కృష్ణా, గోదావరి నదుల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేసింది కేంద్ర జల శక్తి శాఖ. అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

అంతేకాదు, బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలో చేర్చింది కేంద్ర జలశక్తి శాఖ. కృష్ణా, గోదావరి నదీ యజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫలితంగా బోర్డుల పరిధిలోకి కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు వస్తాయి.

అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలి. అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్లు అమల్లోకి రానున్నాయి. ఇక, ఒక్కో రాష్ట్రం బోర్డుకు 200 కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్‌ చేయాలి. సీడ్‌ మనీ కింద ఈ మొత్తాన్ని 60 రోజుల్లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లో చెల్లించాలని కేంద్రం సూచించింది.

Krishna River Water Dispute Between Telangana And Andhra Pradesh

Krishna River Water Dispute

Read also: Chalo Raj Bhavan: కాంగ్రెస్ పార్టీ ఇవాళ ‘చలో రాజ్ భవన్’ పిలుపు.. రాజధానిలో హై టెన్షన్. !