Viral: ఈ క్యూట్‌ చిన్నారి ఇప్పుడు టాప్‌ లీడర్‌.. ఆయన మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండి పోతారంతే. ఎవరో చెప్పుకోండి..

సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో రకరకాల ట్రెండ్స్‌ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటిలో థ్రో బ్యాక్‌ పిక్స్‌ ట్రెండ్ ఒకటి. చిన్నతనంలో దిగిన ఫొటోలను ఇప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ప్రస్తుతం ట్రెండ్‌...

Viral: ఈ క్యూట్‌ చిన్నారి ఇప్పుడు టాప్‌ లీడర్‌.. ఆయన మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండి పోతారంతే. ఎవరో చెప్పుకోండి..
Through Back Photo
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 06, 2023 | 5:09 PM

సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో రకరకాల ట్రెండ్స్‌ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటిలో థ్రో బ్యాక్‌ పిక్స్‌ ట్రెండ్ ఒకటి. చిన్నతనంలో దిగిన ఫొటోలను ఇప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ప్రస్తుతం ట్రెండ్‌. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ థ్రో బ్యాక్‌ ఫొటోనే నెట్టింట తెగ సందడి చేస్తోంది.

పైన ఫొటోలో క్యూట్‌ స్మైల్‌తో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? పెద్ద పెద్ద కళ్లతో చూడగానే అట్రాక్ట్ చేస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు పెద్ద లీడర్‌గా మారారు. తనదైన రాజకీయ చతురతతో తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంగ్లిష్‌లో అనర్గలంగా మాట్లాడే లక్షణం, ప్రతీ అంశంపై నాలెడ్జ్‌, ప్రతి పక్షాల కౌంటర్‌లకు అదిరిపోయే కౌంటర్స్‌ ఇలా యువ రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రను వేసుకున్నారు. నిన్నటి నిన్న తెలంగాణలో అసెంబ్లీలో తన వాగ్ధాటితో ప్రతిపక్షాలకు అదిరిపోయే కౌంట్‌ ఇచ్చారు. ఈపాటికే ఇతకను ఎవరో అర్థమైంది కదూ.!

Ktr

ఇవి కూడా చదవండి

అవును మీరు అనుకుంటోంది నిజమే. ఈ కుర్రాడు మరెవరో కాదు తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారిస్తూ దూసుకుపోతున్నారు కేటీఆర్‌. గతంలో కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫొటోను ట్విట్టర్‌లో ఆయన అభిమాని ఒకరు పోస్ట్ చేశారు. దీంతో ఈ చైల్డ్‌ హుడ్‌ పిక్‌ నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..