Annadata Sukhibhava: వచ్చే నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.6 వేలు.. ఇలా అప్లై చేసుకోవాల్సిందే.. అర్హతలు ఏంటంటే..?
ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం వచ్చే నెలలో అందించనుంది. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా తొలి విడతగా రూ.6 వేలను ఫిబ్రవరిలో జమ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. వచ్చే నెలలో జమ చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్ సాయంతో కలిపి ఈ పథకాన్ని చంద్రబాబు సర్కార్ అమలు చేస్తోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేలు కేంద్ర అందిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం రూ.14 వేలు అందిస్తోంది. దీంతో ఏపీలోని రైతులకు ఏడాదికి రూ.20 వేలు మూడు విడతలుగా అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేసే రోజునే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రిలీజ్ చేస్తోంది ఫిబ్రవరిలో ఈ పథకం కింద రూ.6 వేలు రైతుల అకౌంట్లలో ఏపీ ప్రభుత్వం జమ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎలా అప్లై చేసుకోవాలి..? అర్హతలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు
-ఏపీకి చెందిన వాసి అయి ఉండాలి -5 ఎకరాల్లోపు భూమి కలిగి ఉండాలి -దరఖాస్తుదారుడి వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి -పట్టాదారు పాస్ బుక్ పొంది ఉండాలి -పంట వివరాలను నమోదు చేసి ఉండాలి -ఆధార్‌తో రైతు పేరు లింక్ అయి ఉండాలి -కౌలు రైతులైతే కౌలు ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి
దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు
-ఆధార్ కార్డ్ -పట్టాదారు పాస్ బుక్ -బ్యాంక్ పాస్ బుక్ -పాస్ పోర్ట్ సైజు ఫొటో -సర్వే నెంబర్ వివరాలు -మొబైల్ నెంబర్
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు ఫారం సమర్పించే అధికారులు పరిశీలిస్తారు. అనంతరం లబ్దిదారుల జాబితాలో పేరు చేరుస్తారు
అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?
-https://annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి -‘Know Your Status’ అనే ఎంపికను ఎంచుకోండి -ఆధార నెంబర్ లేదా మొబైల్ నెంబర్ టైప్ చేసి క్యాప్చా కోడ్‌ను నమోదు చేసింది -సెర్చ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి -మీ దరఖాస్తు స్టేటస్ అక్కడ కనిపిస్తుంది
