AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: సంక్రాంతి పోటీలకు పిచ్చి ముగ్గులు వేశారనుకునేరు.. అసలు గుట్టు తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది

హర్రర్ మూవీలలో క్షుద్ర పూజలు, చేతబడులు, దెయ్యాలును చూస్తేనే మనం గజగజ వణికిపోతాం. ఒంటరిగా ఉన్నప్పుడల్లా కొద్ది రోజుల పాటు అవే సీన్లు గుర్తుకు వచ్చి ఒంటరిగా ఉండాలన్నా భయపడిపోతాం. మరి సినిమాల్లో చూపించే ఆ సీన్‌లే మన ఊరులోనో, మన ఇంటి పరిసరాల్లోనో కనిపిస్తే ఎలా ఉంటుంది.

Andhra: సంక్రాంతి పోటీలకు పిచ్చి ముగ్గులు వేశారనుకునేరు.. అసలు గుట్టు తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది
Andhra News
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jan 17, 2026 | 4:36 PM

Share

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం డెప్పిలి గోనపపుట్టుగ గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోని చెల్లెమ్మ చెరువు మీదుగా నీలాపుపుట్టుగ గ్రామానికి వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. రహదారి మధ్యలో పిండితో పుర్రె బొమ్మ వేసి, ముగ్గు వేసి ఉంది. ముగ్గు మధ్యలో వరిగడ్డితో చేసిన బొమ్మ, వేపకొమ్మలు పెట్టారు. సినిమాల్లో చూపించేలా ముగ్గు మధ్యలో పెట్టిన గడ్డితో చేసిన బొమ్మకు వస్త్రం కూడా చుట్టారు. ముగ్గుకి ఇరువైపుల కూర్చొని పూజలు చేసినట్టుగా రెండు వైపుల బొంత, చాప పరిచి ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి. గత 2 రోజుల నుంచి రాత్రిపూట ఇలా జరుగుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. తమ ఊరులో గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదని గ్రామస్తులు అంటున్నారు.

ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో

రేపు ఆదివారం.. చొల్లంగి అమావాస్య..

ఆదివారం రోజున వచ్చే అమావాస్య చాలా పవర్‌ఫుల్ అని అంతా అంటూ ఉంటారు. ఆ రోజు రాత్రిపూట ప్రయాణాలు చేయాలన్నా కొందరు భయపడిపోతూ ఉంటారు. అయితే జనవరి 18న(రేపు) అనగా ఆదివారం అమావాస్య. ఆది కూడా చాలా అరుదుగా వచ్చే చొల్లంగి అమావాస్య. ఈ నేపధ్యంలో ముందు రోజు అనగా శనివారం తెల్లవారుజామున గ్రామంలో క్షుద్ర పూజలు జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. జనవరి 18న జరగనున్న చొల్లంగి అమావాస్య నేపధ్యంలోనే ఈ క్షుద్ర పూజలు చేసి ఉంటారని కూడా గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే గత రెండు రోజులుగా వరుసగా రాత్రిపూట ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నట్టు స్థానికులు గుర్తించారు. ఈ నేపధ్యంలో ఆదివారం చొల్లంగి అమావాస్య కావడంతో మూడో రోజైన శనివారం రాత్రి కూడా క్షుద్ర పూజలు నిర్వహించవచ్చని అనుమానిస్తున్నారు. అసలే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతవాసులకు మూఢనమ్మకాలు పట్ల విశ్వాసం ఎక్కువ. చిల్లంగి, చేతబడి, క్షుద్ర పూజలను నమ్ముతారు. ఈ నేపధ్యంలో తాజాగా కవిటి మండలం డెప్పిలి గోనపపుట్టుగ గ్రామంలో బయటపడ్డ క్షుద్ర పూజలు గ్రామస్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్షుద్ర పూజలు వల్ల గ్రామానికి ఏ ఉపద్రవం వస్తదో, ఎవరికి ఏ కీడు జరుగుతుందో అని గ్రామస్తులు అంతా తెగ భయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి క్షుద్ర పూజలు నిర్వహించిన వారు ఎవరు.? ఎందుకు క్షద్ర పూజలు చేశారన్నది తేల్చాలని కోరుతున్నారు.

ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి