Dairy Milk Chocolate: డైరీ మిల్క్ వివాదంపై స్పందించిన యాజమాన్యం.. రీజన్ అదేనట

అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో షాపులో ఉన్న మిగిలిన తమ డైరీ మిల్క్ చాక్లెట్స్ శాంపిల్స్ ను పరీక్షించామని వాటిల్లో ఎక్కడా ఎటువంటి హానికరమైన పదార్ధాలు కనిపించలేదని పేర్కొన్నారు. అంతేకాదు బహుశా ఆ చాక్లెట్ లో పురుగులు రావడానికి కారణం పంపిణీదాదురు నిల్వ చేసే సమయంలో ఉన్న లోపాలు అని.. అందుకే పురుగులు వచ్చి ఉండవచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తోంది సంస్థ. తమ ఉత్పత్తులను నిల్వ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ విషయం చాక్లెట్ రేపర్ పైనే ఉంటుందని మాండెలెజ్ ఇండియా యాజమాన్యం వివరణ ఇచ్చింది.

Dairy Milk Chocolate: డైరీ మిల్క్ వివాదంపై స్పందించిన యాజమాన్యం.. రీజన్ అదేనట
Dairy Milk ChocolateImage Credit source: Dairy Milk Chocolate
Follow us
Surya Kala

|

Updated on: Feb 29, 2024 | 1:47 PM

చాక్లెట్స్ ను వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అంతేకాదు తమ స్నేహితులకు, సన్నిహితులకు తమ ప్రేమని ఇష్టాన్ని తెలియజేయడానికి చాక్లెట్ ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా నేటి యువతతో పాటు చిన్నారులను కూడా ఆకర్షిస్తున్న చాక్లెట్స్ క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్. అయితే గత కొన్ని రోజులుగా ఈ చాక్లెట్స్ పై వివాదం నెలకొంది. ఇటీవల ఓ షాప్ లో కొన్న చాక్లెట్ లో పురుగులు కనిపించడంతో మొదలైన వివాదానికి కొనసాగింపుగా ఇప్పుడు చాక్లెట్లు తినడం వలన ఆరోగ్యానికి హానికరమని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పేర్కొంది. అయితే ఈ వివాదంపై క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్లను తయారు చేసే సంస్థ మాండెలెజ్ ఇండియా స్పందించింది. తమ ఉత్పత్తులలో ఎటువంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్ధాలు లేవని.. పూర్తి సురక్షితం అని స్పష్టం చేసింది. అంతేకాదు ఇతర ఆహార పదార్ధాలను తయారు చేసే సమయంలో ఏ విధంగా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తామో అదే విధంగా ఇతర ఆహార పదార్ధాల తయారీలో కూడా పాటిస్తామని వెల్లడించింది.

అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో షాపులో ఉన్న మిగిలిన తమ డైరీ మిల్క్ చాక్లెట్స్ శాంపిల్స్ ను పరీక్షించామని వాటిల్లో ఎక్కడా ఎటువంటి హానికరమైన పదార్ధాలు కనిపించలేదని పేర్కొన్నారు. అంతేకాదు బహుశా ఆ చాక్లెట్ లో పురుగులు రావడానికి కారణం పంపిణీదాదురు నిల్వ చేసే సమయంలో ఉన్న లోపాలు అని.. అందుకే పురుగులు వచ్చి ఉండవచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తోంది సంస్థ. తమ ఉత్పత్తులను నిల్వ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ విషయం చాక్లెట్ రేపర్ పైనే ఉంటుందని మాండెలెజ్ ఇండియా యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

తమ సంస్థ తయారుచేస్తున్న ఉత్పత్తుల విషయంలో అంతర్జాతీయంగా ఆమోదించిన హాజర్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని.. ఈ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని వెల్లడించింది. ఆహార ఉత్పత్తులలో రసాయన, సూక్ష్మజీవులు, భౌతిక సంబంధిత సమస్యలు లేకుండా సురక్షితంగా ఉన్నాయనే విషయాన్ని ఈ సంస్థ నిర్ధారిస్తుంది. అయితే క్యాడ్‌బరీ ఉత్పత్తులను తప్పనిసరిగా చల్లని, పరిశుభ్రమైన పొడి ప్రదేశంలో మాత్రమే నిల్వ చేసుకోవాలనే నిబంధన ఉంటుందని పేర్కొంది. అంతేకాదు తమ ఉత్పత్తులను అమ్మే వినియోగదారులు తప్పనిసరిగా నిల్వ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్యాడ్‌బరీ చాక్లెట్స్ తయారు చేసిన మిగిలిన నమూనాలను ఇప్పటికే పరీక్షించామని ఎక్కడా ఎటువంటి సమస్యా దృష్టికి రాలేదని మాండెలెజ్ ఇండియా ప్రతినిధి స్పష్టం చేశారు.

‘మేము ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయంగా ఆమోదించిన HACCP (హాజర్డ్ అనాలిసిస్ & క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్) విధానాలను అనుసరిస్తాము. ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన ఆహార భద్రతా వ్యవస్థగా దీనికి గుర్తింపు ఉంది. మా ఉత్పత్తులు ఎలాంటి భౌతిక, రసాయన, సూక్ష్మజీవ సంబంధిత సమస్యల నుంచి సురక్షితంగా ఉన్నాయని ఇది నిర్ధారింస్తుంది. ఇతర ఆహార ఉత్పత్తుల మాదిరిగానే చాక్లెట్లకు నిల్వ, రిటైల్ వాతావరణం, పంపిణీ వ్యవస్థలలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని, పరిశుభ్రమైన మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలని సూచిస్తూ ప్రతి క్యాడ్‌బరీ లేబుల్‌ను కలిగి ఉంటుంది. ఘటనకు సంబంధించిన క్యాడ్బరీ బ్యాచ్ అన్ని నమూనాలను, అదేవిధంగా అదే సమయంలో తయారు చేసిన ఇతర బ్యాచ్‌ల నమూనాలన్నింటినీ పరీక్షించాము. ఎలాంటి సమస్యా లేదని స్పష్టమైంది’ అని మాండెలెజ్ ఇండియా ప్రతినిధి వివరణ ఇచ్చారు.

అయితే హైదరాబాద్ లోని అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో ఉన్న ఓ షాప్ దగ్గర ఓ వ్యక్తీ క్యాడ్‌బెరీ కంపెనీకి చెందిన డైరీ మిల్క్ చాక్లెట్ కొని. తినడం కోసం రేపర్ విప్పి చూడగా.. అందులో సజీవంగా ఉన్న పురుగులు కనిపించాయి. దీంతో ఆ యువకుడు ఈ చాక్లెట్ ను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది వైరల్ అయింది. తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బీహెచ్ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ విషయంపై విచారణ చేపట్టారు. దుకాణంలోని ఇతర చాక్లెట్ల ప్రామనికలపై దృష్టి పెట్టి.. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. నమూనాలు పరీక్షించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రిపోర్టును ప్రకటిస్తూ.. డైరీ మిల్క్ చాక్లెట్స్ లో ఆరోగ్యానికి హాని చేసే కారకాలు ఉన్నట్లు గుర్తించినట్టు పేర్కొంది. దీంతో తాజాగా డైరీ మిల్క్ చాక్లెట్ మాతృ సంస్థ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..