Viral Video: పచ్చటి వరిపంటలో షాకింగ్ సీన్.. భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టిన రైతు..!

సహజంగా కోతులను అడవుల్లో.. మొసళ్ళను సరస్సులు, నదుల్లో మాత్రమే చూస్తుంటాం. అప్పుడప్పుడు భారీ వరదల సమయాల్లోనూ మొసళ్ళు బయట పడుతుంటాయి. కానీ ఇటీవల కోతుల మాదిరిగానే మొసళ్ళు కూడా జన సంచారంలోకి వస్తున్నాయి. ఇపుడు కోతులతోపాటు మొసళ్ళు కూడా వ్యవసాయ పొలాల్లో దర్శనమిస్తున్నాయి. పంట చేనుల్లో ద‌ర్శనిమిచ్చిన మొస‌లిని మీరేప్పుడైనా చూశారా.. అలాంటి ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లాలో జ‌రిగింది. నల్లగొండ జిల్లా త్రిపురాంలో ఓ మొస‌లి దేవుని మాన్యం వ్యవసాయ పొలాల్లో మొసలి ప్రత్యక్షమైంది. రోజువారి వ్యవ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్నమైన రైతులు ఒక్కసారిగా పంట పొలంలో ఉన్న మొస‌లిని చూసి కంగుతిన్నారు.

Viral Video: పచ్చటి వరిపంటలో షాకింగ్ సీన్.. భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టిన రైతు..!
Green Crop Fields
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: Feb 29, 2024 | 1:19 PM

సహజంగా కోతులను అడవుల్లో.. మొసళ్ళను సరస్సులు, నదుల్లో మాత్రమే చూస్తుంటాం. అప్పుడప్పుడు భారీ వరదల సమయాల్లోనూ మొసళ్ళు బయట పడుతుంటాయి. కానీ ఇటీవల కోతుల మాదిరిగానే మొసళ్ళు కూడా జన సంచారంలోకి వస్తున్నాయి. ఇపుడు కోతులతోపాటు మొసళ్ళు కూడా వ్యవసాయ పొలాల్లో దర్శనమిస్తున్నాయి. పంట చేనుల్లో ద‌ర్శనిమిచ్చిన మొస‌లిని మీరేప్పుడైనా చూశారా.. అలాంటి ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లాలో జ‌రిగింది.

నల్లగొండ జిల్లా త్రిపురాంలో ఓ మొస‌లి దేవుని మాన్యం వ్యవసాయ పొలాల్లో మొసలి ప్రత్యక్షమైంది. రోజువారి వ్యవ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్నమైన రైతులు ఒక్కసారిగా పంట పొలంలో ఉన్న మొస‌లిని చూసి కంగుతిన్నారు. వరి పొలంలో మొసలిని చూసిన రైతు నాగయ్య ఏం జ‌రిగిందో కొద్దిసేపు అర్థం కాక కేక‌లు వేస్తూ పొలాల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశాడు. రైతు నాగయ్య, గ్రామస్తులు అటవీశాఖ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సహాయంతో అధికారులు పొలాల్లోని మొసలిని తాళ్ళతో బంధించి వాహనంలో దానిని ఎక్కించి సమీపంలోని నీటిలో వదిలారు. వరి పొలాలపై భాగంలోని చెరువులోంచి ఈ మొసలి.. పంట పొలాల్లోకి వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వరి పొలాల్లో ప్రత్యక్షమైన మొసలిని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..