Telangana Assembly: మరికాసేపట్లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశంపైనే వాడీ వేడి చర్చ..?

నేటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి రెండు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ హాజరౌతుండటంతో నీటి ప్రాజెక్టుల వివాదంపై వాడివేడిగా చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగిస్తారు.

Telangana Assembly: మరికాసేపట్లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు.. ఈ అంశంపైనే వాడీ వేడి చర్చ..?
Telangana Assembly
Follow us
Srikar T

|

Updated on: Feb 08, 2024 | 7:37 AM

నేటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి రెండు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ హాజరౌతుండటంతో నీటి ప్రాజెక్టుల వివాదంపై వాడివేడిగా చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు వారంరోజులకు పైగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ స్పీచ్ ఒక రోజు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చ‌ర్చకు మరో రోజు స‌భా స‌మ‌యాన్ని కేటాయించే అవకాశముంది. బడ్జెట్ ప్రతిపాద‌న‌కు ఒక రోజు కేటాయించి.. రెండు నుంచి మూడు రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది. వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల చేసి రెండు రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

10 తేదీన శాసనసభలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. మరుసటి రోజు సభకు సెలవు ఇచ్చి తిరిగి 12 వ తేదీన ఓటన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చిస్తారు. సభ ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశం ఉంది.. ప‌రిస్ధితిని బట్టి సమావేశాలు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం ప‌రిశీలిస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మొదటి సారి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేయనున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేస్తోంది. మరో రెండు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వారికి బిల్లు కట్టే అవసరం లేదనే హామీ అమలు చేయనున్నారు. ఈ రెండు పథకాలను సీఎం సభలో ప్రకటించనున్నారు. అభయ హస్తం ద్వారా అప్లై చేసుకున్న వారిలో ఎంత మంది ఏ పథకానికి అర్హులన్న లెక్కలను ఇప్పటికే సేకరించింది ప్రభుత్వం.

గత పదేళ్లలో వ్యవసాయశాఖ పూర్తిగా లోప భూయిష్టంగా మారిందంటూ.. అధికార కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సై అంటోంది. మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వస్తానని చెప్పడంతో సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశముంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..