BRS లో ఏం జరుగుతోంది..? ఇద్దరు నేతలు వారం రోజుల పాటు ఢిల్లీలో ఏం చేశారు?

భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతుంది. పార్టీలో ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ ఇద్దరు వారం రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఏం చేశారు? ఢిల్లీ పర్యటన తర్వాత రెండు రోజులుగా కేసీఆర్ తో ఏం చర్చిస్తున్నారు? ఇదంతా ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో కీలక నిర్ణయాలు ఉంటాయనేది బయటకు వినిపిస్తున్న టాక్..!

BRS లో ఏం జరుగుతోంది..? ఇద్దరు నేతలు వారం రోజుల పాటు ఢిల్లీలో ఏం చేశారు?
Kcr Ktr Harish Rao
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 11, 2024 | 9:26 PM

భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతుంది. పార్టీలో ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ ఇద్దరు వారం రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఏం చేశారు? ఢిల్లీ పర్యటన తర్వాత రెండు రోజులుగా కేసీఆర్ తో ఏం చర్చిస్తున్నారు? ఇదంతా ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో కీలక నిర్ణయాలు ఉంటాయనేది బయటకు వినిపిస్తున్న టాక్..! ఇంతకీ బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..?

పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న భారత రాష్ట్ర సమితికి ఫిరాయింపుల భయం పట్టుకుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. త్వరలో లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ సవాల్ చేస్తోంది. ఇంకోవైపు పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ కేసుల ఉచ్చు బిగిసుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంకా బెయిల్ రాక జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రత్యర్థిగా ఉంది. దీంతో ఈ రానున్న రోజులు మరింత పార్టీకి గడ్డుకాలంగా కనిపిస్తుందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.

ఇన్ని పరిణామాల మధ్య పార్టీ కీలక నేతలు కేటీ రామారావు, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. కవిత మెయిల్ కోసం న్యాయవాదులతో చర్చలు అంటూ బయటకు చెప్తున్నా, అసలు కారణం వేరే ఉందని పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. బీజేపీతో పొత్తు వైపుగా బీఆర్ఎస్ వెళుతుందని మరో వైపు బయట ప్రచారం జరుగుతుంది. అసలు ఢిల్లీలో ఆ ఇద్దరు నేతలు ఎవరిని కలిశారు ఎవరితో సంప్రదింపులు జరిపారు అన్నదీ సస్పెన్స్ గానే మిగిలింది. అటు ఢిల్లీ నుంచి రాగానే ఆ ఇద్దరు నేతలు వరుసగా రెండు రోజుల నుంచి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు. రోజంతా ఢిల్లీ పరిణమాలపై చర్చలు జరుపారు.

అయితే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న సవాలు రెండు. ఒకటి పార్టీని కాపాడుకోవడం, పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. రెండు కేసుల నుంచి బయటపడడం, కొత్తగా రాబోయే కేసులను ఎదుర్కోవడం. ఈ రెండు అంశాలపైనే రెండు రోజులుగా తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తును కాపాడుకుని, ఎమ్మెల్యేలు చేజారుతున్న కిందిస్థాయి క్యాడర్‌ను కాపాడుకోవాలని ఆలోచన. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు తీవ్రతరం చేయాలి. కలిసి వచ్చే పార్టీలు సంఘాలతో ఒక వేదిక క్రియేట్ చేయాలనేది మరో ఆలోచనగా కనిపిస్తోంది.

వీటన్నిటితోపాటు ప్రభుత్వం వేసిన రెండు కమిషన్లతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలపై ఇంకొన్ని కేసులు బీఆర్ఎస్‌కు ఛాలెంజ్‌గా మారనున్నాయి. వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని అవినీతి మరకలు పార్టీకి అంటకుండా చూసుకోవడం ఇప్పుడున్న పెద్ద సవాల్. ఈ రెండు అంశాలపైన త్వరలో అత్యంత కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీలో అంతా భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని కార్యకర్తల అభిప్రాయం. పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ వినోద్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. టెక్నికల్ గా పార్టీ పేరును ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేకున్నా, ఇందుకోసం ఓ ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని కూడా గులాబీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

సేవింగ్స్ ఖాతాలోని సొమ్ముతో ఈజీగా పెట్టుబడి..లాభాలు ఏంటంటే..?
సేవింగ్స్ ఖాతాలోని సొమ్ముతో ఈజీగా పెట్టుబడి..లాభాలు ఏంటంటే..?
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
ఇది అమ్మవారి మహిమే.. పానకం తాగిన ‘వారాహి’ విగ్రహం.. వీడియో
ఇది అమ్మవారి మహిమే.. పానకం తాగిన ‘వారాహి’ విగ్రహం.. వీడియో
శాంసన్ హాఫ్ సెంచరీ.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
శాంసన్ హాఫ్ సెంచరీ.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
ఆ పథకంలో పెట్టుబడితో రాబడి వరద..ప్రభుత్వ మద్దతునిచ్చే పథకం ఏదంటే?
ఆ పథకంలో పెట్టుబడితో రాబడి వరద..ప్రభుత్వ మద్దతునిచ్చే పథకం ఏదంటే?
మీకు వచ్చే అద్దె నుంచి రుణం పొందొచ్చు తెలుసా? డబుల్ ఆఫర్ ఇలా..
మీకు వచ్చే అద్దె నుంచి రుణం పొందొచ్చు తెలుసా? డబుల్ ఆఫర్ ఇలా..
ఆ నలుగురినే ఫాలో అవుతున్న ధోని.. ఎవరంటే..
ఆ నలుగురినే ఫాలో అవుతున్న ధోని.. ఎవరంటే..
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ శుభవార్త.. సూపర్ రాబడితో కొత్త పథకం
సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ శుభవార్త.. సూపర్ రాబడితో కొత్త పథకం
సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ..!
సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ..!
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్..