AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS MLA: గులాబీ పార్టీకి మరో షాక్.. కారు నుంచి మరో ఎమ్మెల్యే జంప్..!

మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష పాత్రకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

BRS MLA: గులాబీ పార్టీకి మరో షాక్..  కారు నుంచి మరో ఎమ్మెల్యే జంప్..!
Revanth Reddy Prakash Goud
Rakesh Reddy Ch
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 11, 2024 | 8:30 PM

Share

మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష పాత్రకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించి మరో ఎమ్మెల్యే హస్తం గూటికి వెళ్ళేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జూలై 12వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. ఆయనతోపాటు మరికొంతమంది నియోజకవర్గ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మొట్ట మొదటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావడం విశేషం. అయితే కేవలం ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను రేవంత్ రెడ్డితో భేటీ అయ్యానని చెప్పుకొచ్చారు. ఇందులో రాజకీయం లేదని అప్పట్లో ఆయన తేల్చి చెప్పారు.

ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే అనేక సమావేశాలకు హాజరయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా వెళ్లి ఆయనతో చాలా సార్లు భేటీ అయ్యారు. పార్టీ మారే ప్రసక్తే లేదు. నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా పార్టీ మార వద్దంటూ చెబుతున్నారు. అంటూ ఆయన గతంలో మీడియాతో అన్న మాటలు. కానీ తాజాగా సీఎం నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లుగా కచ్చితంగా సమాచారం అందుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం దీనిని ధ్రువీకరించింది. ఇప్పటికైతే ప్రకాష్ గౌడ్ మాత్రమే వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నా, మరో ఐదారుగురు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..