AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన బీఆరెస్.. ఎవరెవరున్నారంటే?

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక కోసం బీఆర్ఎస్‌ పార్టీ కోరిన 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్‌ తన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబీతాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టి అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా.. 40 మంది సీనియర్ నేతల పేర్లు ఉన్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన బీఆరెస్.. ఎవరెవరున్నారంటే?
Ubilee Hills Bypoll Brs
Anand T
|

Updated on: Oct 21, 2025 | 6:26 PM

Share

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఆమోదం తెలిపింది. పార్టీ జనరల్ సెక్రెటరీ  సోమ భరత్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు, ఈసీ వాహన అనుమతి పాస్‌లను మంజూరు చేసింది. ఈసీ అతనుమతితో నవంబర్ 11న జరగనున్న ఈ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ను అక్టోబర్ 18, 2025 నుండి ఈ స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నవంబర్ 09, 2025 సాయంత్రం 06.00 గంటలతో ప్రచారాన్ని ముంగించనున్నారు.

BRS స్టార్ క్యాంపెయినర్ల జాబితా

జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక కోసం బీఆర్ఎస్‌ పార్టీ కోరిన 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్‌ తన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. ప్రశాంత్ రెడ్డి, జి. జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి,  ఎస్. నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఇతర మాజీ మంత్రులలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్,  కొప్పుల ఈశ్వర్ ఉన్నారు.

మాజీ ఉప సభాపతులు టి. పద్మారావు గౌడ్, పద్మా దేవేందర్ రెడ్డి తో పాటు, ఎమ్మెల్యేలైన ఎం. కృష్ణ రావు, కె.పి. వివేకానంద గౌడ్, డి. సుధీర్ రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,  కాలేరు వెంకటేశం, పాడి కౌశిక్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్ జాదవ్,  బండారు లక్ష్మా రెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డి, చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.

ఎమ్మెల్సీలలో  దాసోజు శ్రవణ్,  ముఠా గోపాల్, శంబిపూర్ రాజు,  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,  టాటా మధుసూధన్, ఎల్. రమణా,  తక్కెలపల్లి రవీందర్ రావు ఉన్నారు. ఎంపీ  వద్దిరాజు రవి చంద్ర, మాజీ ఎమ్మెల్యేలు  విష్ణు వర్ధన్ రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, షేక్ అబ్దుల్లా సోహైల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.