మీ చెల్లితో పెళ్లి చేయకపోతే ప్రైవేట్ ఫోటోస్ బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్.. కట్‌చేస్తే..
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్ధుంపూర్ దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయకపోతే తన నగ్న ఫోటోలు బయటపెడతానని బెదిరించిన ఓ యువకుడిని ప్రియురాలి సోదరుడు తన స్నేహితుడితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రేమించిన అమ్మాయిని తనకు ఇచ్చిన పెళ్లి చేయకపోతే తనతో ఉన్న నగ్న ఫోటోలు బయటపెడతానని ప్రియురాలి కుటుంబ సభ్యులను ఒక యువకుడు బెదిరించాడు. విషయం తెలిసిన ప్రియురాలి సోదరుడు ఆ యువకుడిని మాట్లాడుదామని పిలిచిన దారుణంగా హత్య చేశాడు. మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్ధుంపూర్ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించిన హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన యువకుడు మహ్మద్ సాబిల్(21).. ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. అయితే సాబిల్‌కు తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు.
యువతి నగ్న ఫోటోలు బయటపెడతానని బెదిరింపు
దీంతో ఆగ్రహించిన సాబిల్ ప్రియురాలితో పెళ్లి చేయకపోతే ఆమె తనతో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని వారి కుటుంబ సభ్యులను, యువతి అన్న సయ్యద్ అప్సర్‌ను బెదిరించాడు. దీంతో పరువుపోతుందని భావించిన యువతి కుటుంబ సభ్యులు ఫోటోలు డిలీట్ చేయాలని సాబిల్‌ను ఎన్ని సార్లు కోరినా అతను వినలేదు. దీంతో సాబిల్‌ను అడ్డుతొలగించుకోవాలని యువతి అన్న అప్సర్ తన స్నేహితుడు సంతోష్‌తో కలిసి ప్లాన్ వేశాడు. పతకం ప్రకారం మాట్లాడుకుందామని సాబిల్‌ను పిలిపించాడు. వారు చెప్పిన చోటుకు వచ్చాక, అప్సర్, అతని స్నేహితులు కలిసి సాబిల్‌ను కారులో ఎక్కించుకొని ముగ్ధుంపూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ సాబిల్‌తో వాగ్వాదానికి దిగారు. తీవ్ర వాగ్వాదం అనంతరం సాబిల్ తలపై బండరాయితో కొట్టి చంపేసి, మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయారు.
నిర్మానుష్య ప్రదేశంలో సాబిల్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ హత్యకు పాల్పడిన నిందితుడు అప్సర్, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
