AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అంగన్వాడీ సెంటర్‌కి వచ్చిన వ్యక్తి.. బుడ్డోడు పెట్టిన కండిషన్‌కు షాక్..

ప్రభుత్వ పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించే అధికారులు పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతుంటారు. విద్యార్థులను పేర్లు అడుగుతూ విద్యాబోధనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఓ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌కు చిత్రమైన అనుభవం ఎదురైంది. తన పేరు చెప్పేందుకు ఓ బుడ్డోడు ఏకంగా కలెక్టర్‌కు కండిషన్ పెట్టాడు.

Telangana: అంగన్వాడీ సెంటర్‌కి వచ్చిన వ్యక్తి.. బుడ్డోడు పెట్టిన కండిషన్‌కు షాక్..
Representative Image
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 25, 2025 | 1:55 PM

Share

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్.. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తన విధుల్లో భాగంగా నూతనకల్ మండలం గుండ్లసింగారంలో కస్తూర్బా పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. సమీపంలోనీ అంగన్వాడీ కేంద్రం ఉండడంతో అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు తమ ఆటల్లో మునిగిపోయారు. వారంతా 2010 నుంచి 2024 మధ్య పుట్టిన జెన్ ఆల్ఫా తరంకు చెందిన ఐదేళ్లలోపు వారే. క్లాసులోకి అడుగుపెట్టిన వెంటనే కలెక్టర్‌కు చిన్నారులంతా తమ చిన్ని గొంతులతో గుడ్ మార్నింగ్ సార్.. అని పలకరించారు.

దీంతో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడా గుడ్ మార్నింగ్ చెప్పారు. కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలోని వివిధ బొమ్మలను చూపిస్తూ.. వాటి పేర్లు అడుగుతుంటే.. పిల్లలంతా హుషారుగా సమాధానాలిచ్చారు. ఆ తర్వాత కలెక్టర్ ఒక్కొక్కరి పేరు అడుగుతుంటే.. ఆ చిన్నారులు చెబుతూ వచ్చారు. కానీ ఓ బుడ్డోడు మాత్రం.. తన పేరు చెప్పేందుకు కలెక్టర్‌కు ఓ కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ విని కలెక్టర్ షాక్ అయ్యాడు. తనను ఎత్తుకుంటేనే పేరు చెబుతానంటూ కండిషన్ పెట్టాడు. దీంతో తనను ఇంప్రెస్ చేసిన బుడ్డోడిని కలెక్టర్ ఎత్తుకున్నాడు. బాగా చదువుకోవాలని కలెక్టర్ చిన్నారులకు చెప్పారు. అంగన్వాడి కేంద్రం నుంచి వెళ్తున్న జిల్లా కలెక్టర్‌కు చిన్నారులంతా బయటకు వచ్చి టాటా చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విరేచనాలు అయినప్పుడు పొడి టీ ఆకులు తింటే నిజంగానే తగ్గుతాయా?
విరేచనాలు అయినప్పుడు పొడి టీ ఆకులు తింటే నిజంగానే తగ్గుతాయా?
మీతో మాట్లాడినవారు మిమ్మల్ని మర్చిపోకూడదా? చిన్న సైకాలజీ ట్రిక్
మీతో మాట్లాడినవారు మిమ్మల్ని మర్చిపోకూడదా? చిన్న సైకాలజీ ట్రిక్
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి సూపర్ న్యూస్.. ఇంకంటే మంచి ఛాన్స్ దొరకదు.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి సూపర్ న్యూస్.. ఇంకంటే మంచి ఛాన్స్ దొరకదు.
అప్పులు వదిలించుకునేందుకు కన్నతల్లినే కడతేర్చిన ఉన్మాద కొడుకు..
అప్పులు వదిలించుకునేందుకు కన్నతల్లినే కడతేర్చిన ఉన్మాద కొడుకు..
కమెడియన్ అలీ జీవితంలో ఎవరికీ తెలియని సీక్రెట్
కమెడియన్ అలీ జీవితంలో ఎవరికీ తెలియని సీక్రెట్
వైభవ్ సూర్యవంశీ కోసం టీమిండియా ప్లాన్ మారుతుందా?
వైభవ్ సూర్యవంశీ కోసం టీమిండియా ప్లాన్ మారుతుందా?
దీపావళికి గోల్డ్ కొనేవారికి నిరాశ.. మళ్లీ పెరిగిన ధరలు..
దీపావళికి గోల్డ్ కొనేవారికి నిరాశ.. మళ్లీ పెరిగిన ధరలు..
దీపావళికి బెస్ట్ లడ్డూ.. ఈ స్వీట్ తిన్నా షుగర్ పెరగదు..
దీపావళికి బెస్ట్ లడ్డూ.. ఈ స్వీట్ తిన్నా షుగర్ పెరగదు..
ఆ సినిమా తర్వాత నా మీద నెగిటివిటీ పెరిగింది..
ఆ సినిమా తర్వాత నా మీద నెగిటివిటీ పెరిగింది..
హైదరాబాద్‌లో పేలుళ్లు, ప్రకంపనల అలజడి.. ఇళ్ల నుంచి జనం పరుగులు
హైదరాబాద్‌లో పేలుళ్లు, ప్రకంపనల అలజడి.. ఇళ్ల నుంచి జనం పరుగులు