AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాములు దొంగలు కాదు వీళ్లు.. ఏకంగా ఆస్పత్రిలోనే చక్కపెట్టేశారు..!

సాధారణంగా మనకు తెలియని ప్రాంతాల్లో ఏదైనా అవసరం పడితే పక్కవారి సహాయం తీసుకుంటాం. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులైతే పరాయి వారికి కూడా ఉపకారం చేస్తుంటారు. వీళ్లు కూడా అమాయకంగా నటించారు. మాట మాట కలిపారు. పెద్దవారిని మాటల్లోకి దించి బాబుని ఎత్తుకుని వెళ్లిపోయారు.

మాములు దొంగలు కాదు వీళ్లు.. ఏకంగా ఆస్పత్రిలోనే చక్కపెట్టేశారు..!
Child Kidnap
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 10, 2025 | 9:28 PM

Share

సాధారణంగా మనకు తెలియని ప్రాంతాల్లో ఏదైనా అవసరం పడితే పక్కవారి సహాయం తీసుకుంటాం. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులైతే పరాయి వారికి కూడా ఉపకారం చేస్తుంటారు. వీళ్లు కూడా అమాయకంగా నటించారు. మాట మాట కలిపారు. పెద్దవారిని మాటల్లోకి దించి బాబుని ఎత్తుకుని వెళ్లిపోయారు. బాలుడు కిడ్నాప్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కిడ్నాప్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడుకు చెందిన అంజిబాబు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 20 నెలల సోమేశ్ కుమార్ అనే కొడుకు కూడా ఉన్నాడు. భార్య భాగ్యలక్ష్మి 8 నెలల గర్భవతిగా ఉంది. భాగ్యలక్ష్మికి జ్వరం వస్తుండడంతో రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. భార్యకు అటెండెంట్‌గా బంధువు పార్వతమ్మను కూడా ఆసుపత్రికి వచ్చింది. తమతోపాటే చిన్నారి సోమేశ్ కుమార్‌ను కూడా ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆస్పత్రి ఆవరణలో ఇతర పేషెంట్స్ బంధువుల మాదిరిగా ఇద్దరు మహిళలు వచ్చారు. వారు భాగ్యలక్ష్మి, పార్వతమ్మతో మాట కలిపారు. ఆస్పత్రిలో మధ్యాహ్నం పేషెంట్స్ కు భోజనం పెడతారు. భోజనం కోసం క్యూ లైన్ ఉండడంతో పక్కనున్న ఇద్దరు మహిళలకు బాబును పట్టుకోమని చెప్పి పార్వతమ్మ వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి బాబు కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు అంజిబాబు, భాగ్యలక్ష్మి బంధు పార్వతమ్మ లబోదిబోమన్నారు. బాలుడు తండ్రి అంజిబాబు నల్లగొండ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని కిడ్నాప్ చేసిన వారి కోసం గాలింపు చేస్తున్నారు.

ఆసుపత్రి తో పాటు, బస్టాండ్ ప్రాంతంలోని సిసి టీవీ ఫుటేజీతో పరిశీలించారు. ఇద్దరు గుర్తుతెలియని మహిళలు బాబును ఎత్తుకొని ఆటోలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు భువనగిరి వైపు వెళ్ళినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..