Bomb Threats: బెంబెలేత్తిస్తున్న బాంబు బెదిరింపులు..వార్నింగ్ ఇచ్చినా ఆగట్లే..

శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌కు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఒక వారంలో ఇన్ని ఫేక్ కాల్స్‌తో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఈ బాంబు బెదిరింపులపై వారం రోజుల వ్యవధిలో 5 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు.

Bomb Threats: బెంబెలేత్తిస్తున్న బాంబు బెదిరింపులు..వార్నింగ్ ఇచ్చినా ఆగట్లే..
Bomb Threats To Shamshabad Airport
Follow us
Vijay Saatha

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 26, 2024 | 8:18 AM

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు, కేంద్రపాలిత సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌కు సైతం గత వారం రోజుల వ్యవధిలో అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. కొద్ది రోజుల క్రితం హకీంపేట్‌లో ఉన్న సీఆర్పిఎఫ్ క్యాంపుకు సైతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో జవహర్ నగర్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఇక తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు శుక్రవారం సైతం మరొక బాంబు బెదిరింపు అలర్ట్ వచ్చింది.

గడచిన వారం రోజుల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో బాంబు బెదిరింపు అలర్ట్‌తో పోలీసులు 5 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అక్టోబర్ 19 నుండి మొదలైన బాంబు అలర్ట్ కంటిన్యూస్‌గా ఐదు రోజులపాటు అలర్ట్ వచ్చింది. అయితే ఈ బెదిరింపులు అన్ని సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ x నుండి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 19న ఏయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్తారా, స్టార్ ఎయిర్, బటిక్ ఎయిర్ ఫ్లైట్ లను పిలుస్తామని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హెచ్చరిక జారీ చేశారు. ఇక అక్టోబర్ 20న అదే ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆకాశ ఎయిర్, స్టార్ ఎయిర్ ఫ్లైట్లను సైతం బాంబులతో పేలుస్తామని ఇదే తరహా బాంబు బెదిరింపులు వచ్చాయి.

అక్టోబర్ 22న ఎయిర్ లైన్ సిబ్బందికి ఒక బెదిరింపు వచ్చింది. ఆన్‌బోర్డులో ఉన్న మొత్తం పది ఫ్లైట్లను పేలుస్తామని హెచ్చరించారు. వీటితోపాటు ఇండిగో విస్తారా ఆకాశ ఎయిర్‌కు చెందిన మొత్తం 13 ఫ్లైట్లను పేలుస్తామని అగంతకులు అలర్ట్ పంపించారు. ఇక అక్టోబర్ 24న ఎయిర్ ఇండియా ఇండిగో విమానాలను పేలుస్తామని సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మరొక పోస్ట్ పెట్టారు. అయితే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ వ్యక్తుల కోసం ఇప్పటికే శంషాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. X కు సైతం ఇప్పటికే లేఖలు రాశారు. ఇక తాజాగా శుక్రవారం సైతం హైదరాబాద్ నుండి చండీగర్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు అలర్ట్ వచ్చింది. ఫ్లైట్‌ను పేలుస్తామని బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయి ఫ్లైట్లో ఉన్న 130 మంది ప్రయాణికులను కిందికి దించి తనిఖీలు చేపట్టారు. ఇదే రోజు మొత్తం 20 ఫ్లైట్లకు దేశవ్యాప్తంగా ఇదే రీతిలో బెదిరింపు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ బెదిరింపులపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో 5 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. బీఎన్ఎస్ 353 (2), 351(1) చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!