AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఐల్యాండ్‌ కోసం మాల్దీవులే వెళ్లాలా.? తెలంగాణలో మదిని దోచే ప్రదేశం..

చుట్టూ నీరు మధ్యలో భూమి ఉండే ఐల్యాండ్ లను సందర్శించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే తెలంగాణకు చెందిన వారు ఇలాంటి అనుభూతిని పొందాలంటే వందల కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్ కు చేరువలో ఓ అద్భుతమైన ప్రదేశం ఉందని మీకు తెలుసా.? లక్నవరంలో ఇప్పటికే రెండు ద్వీపాలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మూడో ద్వీపం అందుబాటులోకి వచ్చింది..

Telangana: ఐల్యాండ్‌ కోసం మాల్దీవులే వెళ్లాలా.? తెలంగాణలో మదిని దోచే ప్రదేశం..
Telangana Tourism
Narender Vaitla
|

Updated on: Oct 26, 2024 | 7:34 AM

Share

చుట్టూ నీరు.. మధ్యలో భూమి. అందులో అందమైన రీసార్ట్‌, రెస్టారెంట్స్, బోటింగ్‌. ఊహించుకోవడానికి ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ! అయితే ఇలాంటి ప్రదేశాన్ని అనుభూతి చెందాలంటే అండమాన్‌, మాల్దీవులు లాంటి సుదూర ప్రదేశాలకు వెళ్లాల్సిందే. అయితే మన తెలంగాణలో కూడా ఇలాంటి ఓ అందమైన టూరిజం స్పాట్‌ ఉందని మీలో ఎంత మందికి తెలుసు. హైదరాబాద్ మహా నగరానికి సమీపంలో ఉన్న అద్బుత టూరిజం ప్లేస్‌లలో లక్నవరం ఒకటి.

ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలంలో బుస్సాపూర్ శివారులో లక్నవరం లేక్ ఉంది. లక్నవరం జలాయశంలో రెండు ద్వీపాలు పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల నుంచి లక్నవరం చూసేందుకు పెద్ద ఎత్తు పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇప్పుడు ఇక్క మరో ద్వీపం అందుబాటులోకి వస్తుంది. ఏకంగా 8 ఎకరాల విస్తీరణంలో ఈ ద్వీపాన్ని టీఎస్‌టీడీసీ, ఫ్రీ కోట్స్‌ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు.

ఇందులో 22 కాటేజీలను నిర్మించారు. అలాగే ఐదు స్విమ్మింగ్ ఫూల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలను కనెక్ట్ చేస్తూ ఏర్పాటు చేశారు. చిన్నారులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఇలాంటి ప్రకృతి అందాలను చూడాలంటే మాల్దీవులు, అండమాన్‌ వెళ్లాలని అనుకుంటాం. కానీ ఇప్పుడు లక్నవరంలోనే ఇలాంటి అనుభూతిని పొందేలా ఏర్పాటుల చేశారు.

ఇక ఈ ఐలాండ్‌ పూర్తి బాధ్యతలను ఫ్రీ కోట్స్‌కు చెందిన సుమారు 40 మంది సిబ్బంది చూసుకుంటారు. ఇప్పటికే పనులన్నీ పూర్తికాగా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 210 కి.మీలో దూరంలో, వరంగల్‌ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ లేక్ ఉంది. దట్టమైన అడవులతో కూడిన కొండల నడుమ ఈ సరస్సు ఏర్పడింది. ఈ ద్వీపంతో పాటు లక్నవరం బ్రిడ్జి కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..