BJP Executive Meet: తెలంగాణ‌లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది.. అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదటి రోజున తాము ఆర్థిక తీర్మానంపై చర్చించామని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2వ రోజు (ఆదివారం) రాజకీయ తీర్మానంపై చర్చ జరిగిందని తెలిపారు.

BJP Executive Meet: తెలంగాణ‌లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది.. అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
Himanta Biswa Sarma
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 03, 2022 | 2:09 PM

Assam CM Himanta Biswa Sarma: దేశంలోని దక్షిణాదిపై బీజేపీ తప్పక పట్టు సాధిస్తుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. సమావేశ వివరాలను మీడియాకు వెళ్లడించిన ఆయన.. సౌత్‌లో బీజేపీ పవర్‌ను త్వరలోనే మీరు చూస్తారని అన్నారు. తెలంగాణ‌లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సమావేశాల్లో హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారంటూ ఆయన వెల్లడించారు. సమావేశంలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించినట్లు హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదటి రోజున తాము ఆర్థిక తీర్మానంపై చర్చించామని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2వ రోజు (ఆదివారం) రాజకీయ తీర్మానంపై చర్చ జరిగిందని తెలిపారు. హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని.. దానికి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మీడియాకు తెలిపారు. గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని హోంత్రి అమిత్ షా పేర్కొన్నారని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని సుప్రీం కోర్టు ప్రకటించిందని, రాజకీయంగా ప్రేరేపించినట్లు కోర్టు పేర్కొందని అసోం సీఎం గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

ప్రతిపక్షం గురించి కూడా అమిత్ షా మాట్లాడారని.. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కాంగ్రెస్ సభ్యులు పోరాడుతున్నారన్నారు. అయితే భయంతో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదన్నారన్నారు. కాంగ్రెస్‌కు మోదీ ఫోబియా ఉందని.. జాతీయ ప్రయోజనాల కోసం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అస్సాం సీఎం పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం