Amit Shah: మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది.. ప్రతిపక్షాల తీరుపై విరుచుకుపడ్డ అమిత్ షా..
Amit Shah: కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో...
Amit Shah: కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా రాజకీయ తీర్మాణం ప్రవేశపెట్టిన తర్వాత షా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే ఉంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అవకాశవాద, అవినీతి రాజకీయాలకు వేదికగా మారిందని షా మండిపడ్డారు. ఈ సందర్భంగా గుజరాత్ అల్లర్ల విషయాన్ని ప్రస్తావించారు. 2022 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఇచ్చిన క్లీన్ చీట్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేసిన అమిత్ షా.. సుప్రీం కోర్టు కొట్టివేసిందని తెలిపారు.
ఇది ముమ్మాటికీ మోదీ ప్రతిష్టను దెబ్బతీయడమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోదీకి క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా.. ‘కొవిడ్, సర్జికల్ స్ట్రైక్స్, రాహుల్‌ను ఈడీ ప్రశ్నించినా.. ప్రతికూల రాజకీయాలు చేస్తున్నారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా మార్చే ప్రయ్నతం చేస్తున్నారు. విచ్చిన్న శక్తులకు సహకరించడం, దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేయడమే కాంగ్రెస్ ఏకైక అజెండా. యువతను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ నిరంతరం ప్రయత్నిస్తోందని, కుదరనిచోట గందరగోళం సృష్టిస్తోందని’ చెప్పుకొచ్చారు. ఇక బెంగాల్‌తోపాటు, తెలంగాణలో బీపేజీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..