BJP Vijaya Sankalpa Sabha: టార్గెట్ తెలంగాణ.. నేడే బీజేపీ విజయ సంకల్ప సభ.. మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..

టార్గెట్‌ తెలంగాణ అంటున్న బీజేపీ ఈసారి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌ వేదికగా నిర్వహించింది. ఇవాళ సాయంత్రం జరిగే విజయ సంకల్ప సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులు ఈ సభకు హాజరు కానున్నారు.

BJP Vijaya Sankalpa Sabha: టార్గెట్ తెలంగాణ.. నేడే బీజేపీ విజయ సంకల్ప సభ.. మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..
Narendra Modi
Follow us

|

Updated on: Jul 03, 2022 | 8:17 AM

BJP Vijay Sankalpa Sabha: కాషాయ దళం కదనోత్సహానికి హైదరాబాద్‌ వేదికైంది. హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గాలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు, జాతీయస్థాయి నాయకులు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే విజయ సంకల్ప సభకు రానున్నారు. సభ కోసం పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా 4 లక్షల చదరపు అడుగుల్లో 10 భారీ జర్మన్‌ టెంట్లు వేశారు. 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. నాయకుల ప్రసంగాలు కనపడేలా 30 ఎల్‌ఈడీ స్ర్రీన్లను అమరుస్తున్నారు. మైదానంలో ఉండే వారితో పాటు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి సైతం నాయకుల ప్రసంగాలు వినిపించేలా స్పీకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికతో పాటు ఏర్పాటు చేసిన షెడ్లు, టెంట్లలో 100 ఏసీలు పెట్టగా, కరెంట్‌ సప్లయ్‌ కోసం 50 జనరేటర్లను, నిఘా కోసం 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్‌ కోసం కంటోన్మెంట్‌ బోర్డు జింఖానా మైదానం, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, బైసన్‌ పోలో, మడ్‌ఫోర్ట్‌లోని హాకీ మైదానంతో పాటు జేబీఎస్‌ పక్కనే ఉన్న ఖాళీ స్థలం కేటాయించారు.

హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తుండటంతో జర్మన్‌ టెంట్లు వేయించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. పది భారీ జర్మన్‌ టెంట్లతో వేసిన షెడ్డు వానకి, గాలులకు సైతం తట్టుకొని నిలబడుతుంది. సాధారణ టెంట్లతో పోలిస్తే ఇది వాటర్‌ ప్రూఫ్‌. ఇతర నగరాల నుంచి కూడా టెంట్లను తెప్పించింది బీజేపీ. నార్మల్‌ టెంట్లను ఇద్దరు ముగ్గురు కలిసి నిలబెట్టొచ్చు. కానీ ఈ భారీ టెంట్ల తీరే వేరు. వీటి ఏర్పాటుకి క్రేన్లను ఉపయోగిస్తున్నారు. అంత స్ట్రాంగ్‌ గా ఉండే టెంట్లను ప్రధాని మోడీ ఆసీనులై ఉండే మెయిన్‌ స్టేజ్‌తో పాటు దానికి ఇరువైపుల ఉన్న స్టేజ్‌లకు ఏర్పాటు చేశారు. వీటికి ఎదురుగా కార్యకర్తల కోసం జర్మన్‌ టెంట్లతో కూడిన 7 భారీ షెడ్లు, వాటి వెనుక మరో మూడు భారీ రేకుల షెడ్లు నిర్మించారు.

టార్గెట్‌ తెలంగాణ అంటున్న బీజేపీ ఈసారి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌ వేదికగా నిర్వహించింది. ఇవాళ సాయంత్రం జరిగే విజయ సంకల్ప సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులు ఈ సభకు హాజరు కానున్నారు. హెచ్‌ఐసీసీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఒక ఎత్తయితే, సాయంత్రం జరిగే విజయ సంకల్ప సభ మరో ఎత్తు. ఈ సభ ద్వారా తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. నిన్న కేసీఆర్ మోడీపై పలు విమర్శలు  చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు జరిగే సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..