Hyderabad Traffic Restrictions: వాహనదారులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే ప్రాంతంలో అంటే..

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నగరమంతా ప్రముఖుల పర్యటన నేపథ్యంలో పోలీసుల బలగాలు ప్రత్యేక భద్రతను ఏర్పాటు..

Hyderabad Traffic Restrictions: వాహనదారులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే ప్రాంతంలో అంటే..
Hyderabad Traffic Police
Follow us
Subhash Goud

|

Updated on: Jul 03, 2022 | 8:23 AM

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నగరమంతా ప్రముఖుల పర్యటన నేపథ్యంలో పోలీసుల బలగాలు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్‌పోర్టు – పరేడ్ గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం నివారించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే టివోలి X రోడ్ నుండి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేశారు.

సికింద్రాబాద్ పరిధిలోని పలు జంక్షన్ లలో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఉండవచ్చునని పేర్కొన్నారు పోలీసులు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య MG రోడ్, RP రోడ్, SD రోడ్లలో, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నుండి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్లు/రోడ్లలో ప్రయాణాలపై ఆంక్షలు విధించనున్నారు.

సాధారణ ప్రజల కోసం ట్రాఫిక్ మళ్లింపులు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళు ప్రయాణికులకు మార్గాలు:

ఇవి కూడా చదవండి

☛ పంజాగుట్ట వైపు నుండి ఖైరతాబాద్, ఆర్ టి సి X రోడ్, మీదుగా చిలకలగూడ నుండి ప్లేట్ ఫారం 10 ద్వారా ప్రవేశం.

☛  ఉప్పల్ వైపు నుండి నారాయణగూడ, ఆర్ టి సి X రోడ్, మీదుగా చిలకలగూడ నుండి ప్లేట్ ఫారం 10 ద్వారా ప్రవేశం

☛ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళు వారు ప్యాటినీ, పారడైస్, బేగంపేట్ దారులలో ఆంక్షలు.

☛ కరీంనగర్, నిజామాబాద్‌ వైపు నుండి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ నుండి వేరే మార్గాల ద్వారా హైదరాబాద్ నగరం లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

☛ ఉప్పల్ వైపు నుండి పంజాగుట్ట/అమీర్‌పేట్‌ వెళ్లే ప్రయాణికులు తార్నాక, రైలు నిలయం రోడ్‌ను నివారించి ఆర్.ట్.సి. X రోడ్ నుండి లక్డికాపూల్ నుండి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు.

☛ మేడ్చల్, బాలానగర్, ఖార్ఖనా, తిరుమలగిరి నుండి సికింద్రాబాద్ వైపు వెళ్ళు ప్రయాణికులు నేరెడిమేట్, మల్కాజ్ గిరి వైపు నుండి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!