- Telugu News Photo Gallery Political photos Karimnagar Artists perform Perini Shivatandavam Dance at BJP National Executive Meeting venue
Perini Dance At BJP Meet: పేరిణి శివ తాండవం వీక్షించిన ప్రధాని మోడీ సహా పలువురు దిగ్గజాలు.. ఈ నృత్యం విశిష్టత ఏమిటంటే
Perini Dance At BJP Meet: కరీంనగర్ జిల్లాకు చెందిన పేరిణి న్రుత్య కళాకారుడు, కళారత్న, మాస్టార్ జరుకుల రతన్ కుమార్ కు అరుదైన అవకాశం లభించింది. ప్రధాని మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాసహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతోపాటు అతిరథుల సమక్షంలో పేరిణి శివ తాండవం చేశారు.
Updated on: Jul 03, 2022 | 7:23 AM

హెచ్ఐసీసీ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ ప్రోత్సాహంతో మాస్టార్ రతన్ కుమార్ పేరిణి శివతాండవం పేరుతో అద్బుతమైన ప్రదర్శన ఇచ్చారు.

తెలంగాణకు మాత్రమే సొంతమైన ఈ పేరిణి శివతాండవం కాకతీయ రాజుల కళా స్రుష్టికి నిదర్శనం. నాడు కాకతీయులు యుద్దానికి వెళ్లే సైనికులను ప్రేరేపించడం కోసం నాటి కాకతీయ నాట్యాచార్యులు జయప సేనాని ఈ యుద్ద కళను స్రుష్టించారు. అంతరించి పోతున్న ఈ కళను నటరాజ రామక్రిష్ణ పున: ప్రతిష్ట చేశారు.

ఆయన వద్ద శిష్యరికం చేసిన రతన్ కుమార్ అద్బుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రతన్ కుమార్ శివతాండవం పూర్తయిన వెంటనే ప్రధాని మోదీసహా అక్కడున్న వాళ్లంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మాస్టార్ రతన్ కుమార్ మాట్లాడుతూ... బండి సంజయ్ కుమార్ గారి ప్రోత్సహంతోనే ఈ ప్రదర్శన ఇచ్చానన్నారు. ప్రధానిసహా దిగ్గజాల సమక్షంలో పేరిణి శివతాండవం చేయడం తనకు మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక క్రుతజ్ఝతలు తెలిపారు.

బంజారా సామాజికవర్గానికి చెందిన రతన్ కుమార్ గతంలోనూ పలువురు ప్రముఖుల వద్ద పేరిణి న్రుత్య రూపకాన్ని ప్రదర్శించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో 101 ఆలయాల్లో న్రుత్య యజ్ఝం చేశారు. అమెరికాసహా అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.





























