Jaggareddy: కాంగ్రెస్‌ పార్టీలో ముదురుతున్న వివాదం.. రేపు సంచలన ప్రకటన చేస్తానన్న జగ్గారెడ్డి.. రేవంత్‌రెడ్డిపై ఫైర్‌

Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో వివాదం ముదురుతోంది. జాగ్గారెడ్డి-రేవంత్‌ రెడ్డిల మధ్య హీట్‌ పెరుగుతోంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సొంత..

Jaggareddy: కాంగ్రెస్‌ పార్టీలో ముదురుతున్న వివాదం.. రేపు సంచలన ప్రకటన చేస్తానన్న జగ్గారెడ్డి.. రేవంత్‌రెడ్డిపై ఫైర్‌
MLA Jaggareddy
Follow us
Subhash Goud

|

Updated on: Jul 03, 2022 | 1:50 PM

Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో వివాదం ముదురుతోంది. జాగ్గారెడ్డి-రేవంత్‌ రెడ్డిల మధ్య హీట్‌ పెరుగుతోంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సొంత కుంపటిలోనే ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. నిన్న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా విషయంలో రేవంత్‌ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడంటూ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. దీంతో రేవంత్‌ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు జగ్గారెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రేపు ఒక సంచలన నిర్ణయం తీసుకుంటానని జగారెడ్డి ఒక ప్రకటన విడుదల చేయడం సంచలనంగా మారింది. ఆయన లేఖలో రేవంత్‌రెడ్డిపై సంచనల వ్యాఖ్యలు చేశారు.

గతంలో మేము ఎప్పుడైనా పార్టీలో ఉన్న విభేదాల గురించి మీడియా ముందు మాట్లాడినప్పుడు దానిపై రేవంత్ రెడ్డి టీమ్ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణికం ఠాగూర్‌కు అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ విషయం అందరికి తెలుసని జగ్గారెడ్డి గుర్తు చేశారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గారు సీనియర్ లీడర్లు, రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, రాహుల్‌గాంధీతో సమావేశం తర్వాత మూడు నెలల్లో రేవంత్‌ రెడ్డి తీరు మారకపోతే మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదని, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన గురించి ఎంపీలతో రేవంత్‌రెడ్డి ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదని, ఇలా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో మాట్లాడకుండానే మీడియా ముందు మాతో మాట్లాడినట్లు చెప్పానని ఆరోపణలు గుప్పించారు.

దీని తర్వాత రేవంత్‌రెడ్డి పీసీసీ హోదా మరిచి పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఇలా ఎవరు వ్యవహరించి గోడకు వేసి కొడుతా అని అవమాపరిచేలా, రెచ్చగొట్టే విధంగా మీడియా ముందు మాట్లాడారని దుయ్యబట్టారు. అదే రీతిలో నేను రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించడం జరిగిందని జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆ అంశం నన్ను బాధ పెట్టింది..

నేను మీడియా ముందు వచ్చి మాట్లాడే ఒక పరిస్థితి తీసుకొచ్చింది కూడా రేవంత్ రెడ్డి అని, ఈ అంశం నాకు ఎంతో బాధేసిందని, ఎందుకంటే మీడియా ముందు తెలంగాణ పార్టీ నాయకుల గురించి మాట్లాడను అని రాహుల్ గాంధీకి మాటిచ్చారని, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అనుకోకుండా ఏదైనా నష్టం జరిగితే ఆ నింద నాపై పడే అవకాశం ఉందని, ఆ నింద నాపై వేసే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తాడని, అలాంటి గుణాలు రేవంత్‌ రెడ్డికి ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి వల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.

తొమ్మిదేండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. రేవంత్ రెడ్డి టీడీపీ నాయకుడిగా ఉన్నపుడు ఓటుకు నోటు కేసులో రాజకీయ అతి ఉత్సాహంలో చంద్రబాబు తెలంగాణలో రాజకీయంగా కనుమారుగైపోయాడని, ఈ రోజు చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి కూడా లేన్నట్లుగానే జీవిస్తున్నాడన్నారు.

ఒక రాజకీయ యుద్ధం చేయాలంటే దానికి ఒక వ్యూహం ఉండాలి.. ఆ యుద్ధం చేసే బాధ్యత ఉన్న అధిపతి అందరి ఆలోచనలతో కుడుకున్న వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరించడం లేదు. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలోచన చేయాలి.. అని వ్యాఖ్యానించారు. ఇలా పార్టీలో ముదురుతున్న వివాదాల నేపథ్యంలో సోమవారం ఒక సంచలన ప్రకటన చేయబోతున్నానని జగారెడ్డి ప్రకటించారు. ఇప్పుడు రేపు జగ్గారెడ్డి చేసే సంచలన నిర్ణయం ఏంటనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!