Bandi Sanjay: వాళ్లదంతా దండుపాళ్యం బ్యాచ్.. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీదే అధికారం.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోందని.. పార్టీని ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం..
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోందని.. పార్టీని ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వాళ్లంతా దండుపాళ్యం ముఠా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో దూరమైందన్న బండి సంజయ్.. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్–కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయనే విషయాన్ని తాము గతంలోనే చెప్పామనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే.. వాళ్లు గెలిచి చివరికి వెళ్లేది బీఆర్‌ఎస్ పార్టీలోకే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బీఆర్‌ఎస్‌తో కొట్లాడే దమ్ము లేదు. కొట్లాడి గెలిపించినా మళ్లీ ఎలాగూ బీఆర్‌ఎస్ పార్టీలోకే వెళ్తారు. అందుకే తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌తో కలిసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై గతంలో ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే. అందుకే బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.
– బండి సంజయ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కాగా.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయలతోపాటు రాబోయే రోజుల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత రాబోయే రోజుల్లో ఏం చేస్తారో కూడా చెప్పారు. వచ్చే నెల నుంచి చేయనున్న యాత్ర గురించి కూడా చెప్పారు. తెలంగాణలో వచ్చేది హంగ్ ప్రభుత్వం అంటూ తేల్చి చెప్పారు. ఎవరికీ కూడా 60 సీట్లకు మించి రావన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ తో నడవక తప్పదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి