Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్.. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఘటన..
గోదావరి ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు.. బీబీనగర్ సమీపంలో పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు..
గోదావరి ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు.. బీబీనగర్ సమీపంలో పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హాహాకారాలు చేశారు. లగేజితో సహా కిందికి దిగి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్య స్థానాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో బీబీనగర్ రైల్వే స్టేషన్ లో విశాఖ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి