AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Arvind: నిజామాబాద్‌లో బీజేపీ నేత‌ల వార్‌.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

నిజామాబాద్ బీజేపీలో ముసలం మొదలైంది. ఇన్ని రోజులు అంత‌ర్గత కుమ్ములాట‌లుగానే ఉన్నా గోడ‌వ‌లు ఇప్పుడు ర‌చ్చకెక్కి ...పార్టీ ఆఫీసు మెట్లు కూడ ఎక్కాయి..ఎంపీ అర్వింద్ తీరును నిర‌సిస్తూ సోంత పార్టీ నేత‌లే హైద‌రాబాద్ నాంప‌ల్లి బీజేపీ ఆఫీసులో ఆందోళ‌న‌కు దిగ‌డం ఇప్పుడు జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది.

MP Arvind: నిజామాబాద్‌లో బీజేపీ నేత‌ల వార్‌.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు
Mp Arvind
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 26, 2023 | 8:21 PM

Share

నిజామాబాద్ బీజేపీలో ముసలం మొదలైంది. ఇన్ని రోజులు అంత‌ర్గత కుమ్ములాట‌లుగానే ఉన్నా గోడ‌వ‌లు ఇప్పుడు ర‌చ్చకెక్కి …పార్టీ ఆఫీసు మెట్లు కూడ ఎక్కాయి..ఎంపీ అర్వింద్ తీరును నిర‌సిస్తూ సోంత పార్టీ నేత‌లే హైద‌రాబాద్ నాంప‌ల్లి బీజేపీ ఆఫీసులో ఆందోళ‌న‌కు దిగ‌డం ఇప్పుడు జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది. గ‌త కోద్ది రోజులుగా అర్వింద్ ఏక‌ప‌క్ష వైఖరితో పాటు త‌మ‌కు పోటిగా ఇత‌ర నాయ‌కుల‌ను తీసుకువ‌చ్చి పెట్టడంపై కూడా పైర్ అవుతున్నారు ఆ జిల్లా బిజేపీ నేత‌లు. నిజామాబాద్ నుండి బుధవారం ఉదయం దాదాపు 200 మంది కార్యకర్తలు హైదరాబాద్ కు వెళ్లారు. తమను కాదని కోత్త వారిని పార్టీలోకి తీసుకు వస్తున్నారంటూ ఆరోపించారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు.. తమకు తెలియకుండానే మండల అధ్యక్షులను ఏలా మారుస్తారు అని ప్రశ్నించారు… తమకు న్యాయం చేయకపోతే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు..

పాత వాళ్ళను కాదని కొత్త వాళ్ళను తీసుకోవడమే సమస్య

గ‌త కోద్ది కాలంగా జిల్లా పార్టీలో అర్వింద్ ఒంటెద్దు పోక‌డ‌ల‌పై సోంత పార్టీ నాయ‌కులే గుర్రుగా ఉన్నారు. ఆర్మూరులో ప్రోద్దూటురి విన‌య్ రెడ్డి 2017 నుండి పార్టీలో కొన‌సాగుతున్నారు. 2018 లో బిజేపీ త‌రుపున పోటీ చేసారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో కూడా ఎక్కువ మెజార్టీ కోసం కృషి చేసి స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు గ్రౌండ్ అంత సిద్ధం అయ్యాక.. అక్కడ రాకేష్ రెడ్డి అనే అత‌న్ని పార్టీలో జాయిన్ చేసుకోని అత‌నికే టికెట్ అంటూ ప్రక‌టించ‌డం ఇప్పుడు వివాద‌స్పందంగా మారింది. ఇప్పుడు వేసిన మండ‌ల అధ్యక్షుల లిస్ట్ లో కూడ వినయ్ రెడ్డి ఇచ్చిన ఒక్క పేరు కూడ లేక‌పోవడంతో ఆగ్రహించిన విన‌య్ రెడ్డి ఇప్పుడు ఈ ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు. రాకేశ్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకురావ‌డంతో క్యాడ‌ర్ లో ఇంట్రస్ట్ లేక‌పోయిన అర్వింద్ సోంత ప్రయోజనాలక కోసం తీసుకువ‌చ్చార‌ని ఫైర్ అవుతున్నారు విన‌య్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

ఇక అటు బాల్కోండ లోను క్యాడ‌ర్ తో సంబంధం లేకుండా మల్లిఖార్జున్ రెడ్డిని తీసుకురావడం పై ఫేర్ అవుతున్నారు. అక్కడ గ‌తంలో పోటీ చేసిన రాజేశ్వర్.. సునీల్ రెడ్డిని తీసుకోవాల‌ని క్యాడ‌ర్ కోరినప్పటికీ తీసుకోకుండా మ‌ల్లిఖార్జున్ రెడ్డిని తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లంద‌రికి టికెట్ హ‌మీ అర్విందే ఇస్తున్నారని.. ఇది పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేక‌మంటున్నారు. ఇప్పటికైనా అర్వింద్ తీరులో మార్పు రాక‌పోతే పార్టీ మార‌డానికి కూడ సిద్దమంటున్నారు నిజామాబాద్ బీజేపీ నేతలు.