Telangana: అమిత్‌షా, నడ్డాతో ముగిసిన తెలంగాణ బీజేపీ నేతల మీటింగ్.. ఏయే అంశాలు చర్చించారంటే.
నడ్డా, అమిత్‌షాలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఢిల్లీలో దాదాపు మూడున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది. అత్యవసరంగా రావాలంటూ వచ్చిన పిలుపుతో హస్తినకు వెళ్లిన తెలంగాణ బీజేపీ నాయకులు.. జేపీ నడ్డా ఇంట్లో అమిత్‌షాతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం...
నడ్డా, అమిత్‌షాలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఢిల్లీలో దాదాపు మూడున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది. అత్యవసరంగా రావాలంటూ వచ్చిన పిలుపుతో హస్తినకు వెళ్లిన తెలంగాణ బీజేపీ నాయకులు.. జేపీ నడ్డా ఇంట్లో అమిత్‌షాతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించామనన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెడతారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పుకొచ్చారు.
మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ్, ఈటల రాజేందర్, విజయశాంతి, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, జితేందర్ రెడ్డి, పొంగులేటి, అరవింద్ సుధాకర్‌తో పాటు మరికొందరు నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో అమిత్‌షా, నడ్డా దిశా నిర్దేశం చేశారు. మిషన్ 90, ఎన్నికల ప్రణాళికలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కమలం గుర్తును ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలా చర్యలు చేపట్టాలని అమిత్‌షా హితబోధ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. కర్ణాటక తర్వాత తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై సమయం దొరికినప్పుడల్లా అటాక్ చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..