Hyderabad: బిల్డప్ బాబాయ్ బాపులా ఉన్నాడే.. తాగి డ్రైవింగ్ చేసింది కాక…
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పోలీసులపై బూతులతో రెచ్చిపోయాడు.
మత్తులో జోగుతోన్న ఓ యువకుడు హైదరాబాద్‌లో వీరంగం వేశాడు. తాగి కారు నడపడమే కాకుండా…బ్రీత్ అనలైజ్ పరీక్షల్లో అడ్డంగా బుక్కయి…పోలీసులపైనే బూతులు లంకించుకున్నాడు. బంజారా హిల్స్ లో మద్యం మత్తులో ఈ యువకుడి వీరంగం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. బ్రీత్ అనలైజ్ పరీక్షలో తాగినట్లు తేలడంతో ఆ యువకుడిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో రెచ్చిపోయిన గౌరవ్ అనే ఈ యువకుడు ట్రాఫిక్ ఎస్ ఐని నానా దుర్భాషలాడుతూ తనకు హైకోర్టు జడ్జి తెల్సునని…నీమేదే కేసుపెడతానని అంటూ ఎస్ ఐ ని కాలితో తన్నుతూ నానా రచ్చ చేశాడు. కారుని సీజ్ చేసి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..