Kishan Reddy: ఈటలను చూడటం ఇష్టం లేకపోతే.. మీరే అసెంబ్లీకి రావొద్దు.. టీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
ఈటల రాజేందర్‌ని సభ నుంచి సస్పెండ్ చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ను సభలో చూడటం ఇష్టం లేకపోతే.. టీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీకి రావొద్దు అంటూ మండిపడ్డారు.
Kishan Reddy on TRS: ఈటల రాజేందర్‌ని సభ నుంచి సస్పెండ్ చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ను సభలో చూడటం ఇష్టం లేకపోతే.. టీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీకి రావొద్దు అంటూ మండిపడ్డారు. ఈటల రాజేందర్ మరమనిషి అన్నారని తెగ ఫీలయిపోతున్నారు.. అదేమైన అన్ పార్లమెంటరీ భాషనా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కనీసం మీరు మహిళలను గౌరవించరు.. గవర్నర్‌కి విలువ ఇవ్వరు.. ఇదేం పద్ధతి అంటూ టీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏదైనా మాట్లాడితే బూతు అంటారని.. మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొచ్చు.. ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి పదిమందికి ఆదర్శంగా ఉండాలని.. కాని అలా వ్యవహరించడం లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
కాగా, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత.. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఈ సమావేశాల వరకు సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు ఈటలను అక్కడినుంచి శామీర్‌పేటలోని తన నివాసానికి తరలించారు. కాగా.. ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఏడాదిగా కుట్ర చేస్తున్నారని.. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం