AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By Election: చివరికి ఇలా కూడా చేస్తారా?.. హుజూరాబాద్ పోలింగ్‌పై ఈటల షాకింగ్ కామెంట్స్..

Huzurabad By Election: హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ తీరుపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు

Huzurabad By Election: చివరికి ఇలా కూడా చేస్తారా?.. హుజూరాబాద్ పోలింగ్‌పై ఈటల షాకింగ్ కామెంట్స్..
Etela Rajender
Shiva Prajapati
|

Updated on: Oct 31, 2021 | 11:52 AM

Share

Huzurabad By Election: హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ తీరుపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు సీపీ, కలెక్టర్‌కి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. అందరూ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆదివారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో అధికార పార్టీ వ్యవహరించిందన్నారు. డబ్బులు పెట్టి గెలిచే పద్ధతి మంచిది కాదన్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారని ఆరోపించారు. బస్సులలో ఈవీఎంల ను కూడా తరలించినట్లు వార్తలు వస్తున్నాయని, ఈవీఎంలు కరాబ్ అయ్యాయని మార్చడం పలు అనుమానాలకు తావిస్తోందని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్‌లో తనను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేశారని విమర్శించారు.

‘‘డబ్బులు పంచారు, మందు పంచారు, బెదిరించారు, మభ్యపెట్టారు, చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.’’ అని అన్నారు. అన్ని చేసినా కూడా గెలవలేక.. ఇప్పుడు ఈవీఎంలను మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈటల రాజేందర్. ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా ఓటు వేసిన బ్యాక్స్‌లు మాయం చేయడం దుర్మార్గపు చర్య అని నిప్పులు చెరిగారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని, ఇది చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు. కలెక్టర్ పొరపాటు జరిగిందని చెబుతున్నారని, అసలు పొరపాటు జరుగడం ఏంటని ప్రశ్నించారు. ఇది మామూలు ఎన్నిక కాదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ‘‘ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికపై ఇంత నిర్లక్ష్యమా? ఇది నీచమైన చర్య..’’ అంటూ అధికారుల తీరుపై ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు.

ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు.. ఇదిలాఉంటే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ని బీజేపీ నేతలు డీకే అరుణ, రాజాసింగ్, ఎన్ రామచందర్ రావు కలిశఆరు. హుజురాబాద్ పోలింగ్ తర్వాత వీవీ ప్యాట్లను వేరే వాహనంలోకి తరలించడంపై ఫిర్యాదు చేశారు. రాత్రి జరిగిన వీవీ ప్యాట్ల తరలింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు.

Also read:

Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం.. 11 మంది దుర్మరణం..

Hyderabad: నీలోఫర్‌ ఆసుపత్రిలో దారుణం.. రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్‌బాయ్‌..

Teeth Pain: మీరు స్వీట్ తింటుంన్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.. పంటినొప్పి రాకుండా చేసుకోండి..