AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani: మరోసారి టాప్ ప్లేస్ లో బిర్యానీ.. అదరగొట్టిన ఇడ్లీ, టమోటాలు.. సర్వేలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

టెక్నాలజీ పెరిగిపోయింది. అన్ని రకాల సేవలు చిటికెలో వాలిపోతున్నాయి. కాలు కదపకుండానే కోరుకున్న వస్తువు గుమ్మం ముందుకు వచ్చేస్తోంది. అయితే.. చాలా మందికి ఆహారం వండుకోవడానికి, తినడానికి...

Biryani: మరోసారి టాప్ ప్లేస్ లో బిర్యానీ.. అదరగొట్టిన ఇడ్లీ, టమోటాలు.. సర్వేలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
Biryani
Ganesh Mudavath
|

Updated on: Dec 23, 2022 | 9:09 AM

Share

టెక్నాలజీ పెరిగిపోయింది. అన్ని రకాల సేవలు చిటికెలో వాలిపోతున్నాయి. కాలు కదపకుండానే కోరుకున్న వస్తువు గుమ్మం ముందుకు వచ్చేస్తోంది. అయితే.. చాలా మందికి ఆహారం వండుకోవడానికి, తినడానికి కూడా టైమ్ లేకుండా పోతోంది. ఉద్యోగాలు చేసే వారిలో ఈ సమస్య చాలా ఎక్కువ. ఇక బ్యాచిలర్స్ ఇబ్బందుల గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి ఫుడ్ డెలివరీ సంస్థలు. నచ్చిన ఆహారం.. కోరుకున్న చోటికి.. వచ్చేలా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ క్రమంలో ప్రముఖ డెలివరీ సంస్థ.. స్విగ్గీ పలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వెల్లడించింది. హైదరాబాద్ నగరం, జిల్లాలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటున్న ఆహార పదార్థాల జాబితాలో చికెన్ బిర్యానీకే మరోసారి ఫస్ట్ ప్లేస్ దక్కింది. తింటే చికెన్‌ బిర్యానీనే తినాలంటున్నారు భోజనప్రియులు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే వంటకాల్లో వరసగా మూడో ఏడాది బిర్యానీకే నగరవాసులు ఎక్కువగా మొగ్గుచూపారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మాత్రం ఇడ్లీకే మొగ్గు చూపుతున్నాయి. ఆవిరి పై ఉడికించడం, హెల్తీ క్వాలిటీస్ ఉండటంతో ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఇడ్లీనే ఇష్టపడుతున్నారు.

అత్యధికంగా ఆర్డర్‌ చేసిన మొదటి మూడు వంటకాల్లో చికెన్‌ బిర్యానీ, అప్రికాట్‌ డిలైట్‌, మటన్‌ బిర్యానీ నిలిచాయి. స్నాక్‌ డిషెస్‌లో ఇడ్లీ, మస్కాబన్‌, మసాలా దోశను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. డెజర్ట్‌లలో అప్రికాట్‌ డిలైట్‌, డబుల్‌ కా మిఠా, ఫ్రూట్‌ సలాడ్‌ విత్‌ ఐస్‌క్రీమ్‌, అంతే కాకుండా కూల్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు కూడా ఉండటం విశేషం.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. మార్కెట్లో తరచూ ధరల హెచ్చుతగ్గులతో వార్తల్లో నిలిచే టమోటా మరో వార్తను మోసుకొచ్చింది. హైదరాబాద్‌లో ఆహారం కాకుండా ఆన్‌లైన్‌లో ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నవాటిలో టమాటా స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌, తెలంగాణకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఆర్డర్‌ విశేషాలను విడుదల చేసిన స్విగ్గీ ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ను పంచుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..