Green India Challenge: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్ బ్యూటీ శ్వేత వర్మ.. మరో ముగ్గురికి ఛాలెంజ్..
Green India Challenge: తెలంగాణ(Telangana)ను హరిత వనంగా తీర్చిదిద్దడానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్(MP Joginapally Santosh Kumar) ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా..
Green India Challenge: తెలంగాణ(Telangana)ను హరిత వనంగా తీర్చిదిద్దడానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్(MP Joginapally Santosh Kumar) ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి అనేక మంది ముందుకొచ్చి పర్యావరణ పరిరక్షణ కోసం మేము సైతం అంటూ మొక్కలు నాటుతున్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటులే కాదు.. క్రీడాకారులు, రాజకీయ నేతలు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రశాసన్ నగర్ జిఎచెంసి పార్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్వేత వర్మ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్వేత వర్మ మాట్లాడుతూ పర్యవరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం అనీ మాస్టర్, లహరి ,డైరెక్టర్ వరుణ్ వంశీ ముగ్గురికి శ్వేత వర్మ గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరారు.
బిగ్ బాస్ సీజన్ 5 లో శ్వేతా వర్మ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పటి వరకూ రాణి, పచ్చీస్ , మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల్లో నటించింది. వీటితో పాటు గుడ్ లఖ్ సఖి, ఏకం, కొండవీడు, రోజ్ విల్లా, ఇంకొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది.
Also Read: