AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Shetty: డీజే టిల్లు హీరోయిన్‌ ఇంట్లో విషాదం.. నా హృదయం ముక్కలైపోతుందంటూ నేహ ఎమోషనల్‌ పోస్ట్‌..

మెహబూబా, గల్లీ రౌడి సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది నేహాశెట్టి (NehaShetty). కానీ  కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు.

Neha Shetty: డీజే టిల్లు హీరోయిన్‌ ఇంట్లో విషాదం.. నా హృదయం ముక్కలైపోతుందంటూ నేహ ఎమోషనల్‌ పోస్ట్‌..
Neha Shetty
Basha Shek
|

Updated on: Feb 13, 2022 | 3:35 PM

Share

మెహబూబా, గల్లీ రౌడి సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది నేహాశెట్టి (NehaShetty). కానీ  కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు. అయితే సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) తో కలిసి ఆమె నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) ఆ కొరతను తీర్చేసింది. నిన్న(ఫిబ్రవరి12)న విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ పాజిటివ్‌ రివ్యూస్‌ తో దూసుకెళుతోంది. సినిమాలో నేహ అందం, అభినయంతో ఆకట్టుకుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ‘డీజే టిల్లు’ విజయాన్ని ఆస్వాదించే లోపే నేహా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సినిమా విడుదల రెండు రోజులకు ముందే ఆమె బామ్మ మృతి చెందారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుని భావోద్వేగానికి గురైందీ అందాల తార.

ఈ విజయం నీకే అంకితం..

ఈ సందర్భంగా తన బామ్మతో వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన నేహా.. ‘నా మొదటి అతిపెద్ద అభిమాని, నా ఛీర్‌ లీడర్‌ నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను రెండేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే నా పర్ఫామెన్స్‌ చూసేందుకు మా బామ్మ ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేది. ఫిబ్రవరి12 (డీజే టిల్లు రిలీజ్‌ డేట్‌) నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. అయితే దురదృష్టవశాత్తూ నా విజయాన్ని, సంతోషాన్ని పంచుకునేందుకు నా పక్కన లేరని తలుచుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది. కానీ ఆమె ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాతోపాటే ఉంటాయిని కాస్త కుదుటపడ్డాను. ఐ లవ్‌ యూ అవ్వా, డీజే టిల్లు విజయాన్ని నీకే అంకితం ఇస్తున్నా.. డీజే టిల్లును బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని ఎమోషనల్‌ నోట్‌ను రాసుకొచ్చింది.

Also Read:Telangana: మాతృభూమిపై మమకారం చాటుకుంటోన్న ఎన్నారైలు.. మన ఊరు- మనబడికి విరాళాల వెల్లువ..

Sitara Gattamaneni: మహేష్ ముద్దుల కూతురు సితార ఎవరితో పైట్ చేస్తోంది గుర్తించండి.. మహేష్ ? గౌతమ్ ఆ ?.. 

TS Eamcet 2022: తెలంగాణ ఎంసెట్ 2022 జూన్‌-జూలైలో.. త్వరలో షెడ్యూల్‌ విడుదల!