Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రిఫరెండమన్న కాంగ్రెస్‌కు జనం జై కొట్టారా? బీజేపీకి డబుల్‌ డిజిట్‌ ఇస్తున్నారా?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జరిగిన మార్పులు.. తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలతో మరో టర్న్‌ తీసుకోబోతున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే, అది ఎలాంటి మలుపు అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ జనం ఎటువైపు నిలిచారు? రాబోయే ఫలితాలు ఏపార్టీకి అనుకూలంగా ఉండబోతున్నాయి? అన్నదే హాట్‌ పాయింట్‌గా మారింది. బట్‌, నేతల మాటలు వింటుంటే.. స్టేట్‌ పాలిటిక్స్‌కు ఆగస్టు ఫీవర్‌ పట్టి పీడిస్తోందన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది.

Telangana: రిఫరెండమన్న కాంగ్రెస్‌కు జనం జై కొట్టారా?  బీజేపీకి డబుల్‌ డిజిట్‌ ఇస్తున్నారా?
Big News Big Debate
Ram Naramaneni
|

Updated on: May 15, 2024 | 7:04 PM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన పొలిటికల్‌ వేడి… ఎంపీ ఎన్నికలు ముగిసినా చల్లారట్లేదు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ ఓవైపు… సీట్లు, ఓట్లు పెంచుకున్న బీజేపీ మరోవైపు… అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవిచూసిన బీఆర్‌ఎస్ ఇంకోవైపు… ఈ మూడు పక్షాలు హోరాహోరీగా తలపడటంతో పార్లమెంట్‌ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా తలపడిన ఈ ఎన్నికల్లో… జనం ఎటువైపు నిలిచారన్నదే తెలియాల్సి ఉంది.తమ పాలనకు రెఫరెండమన్న కాంగ్రెస్‌ను ఆదరించారా? బీజేపీకి మరింత బలాన్నిచ్చారా? గ్యారేజీకి పోయిన కారును సపోర్ట్‌ చేశారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

రిజల్ట్‌ ఎలా ఉన్నా, నేతల మాటలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్తమంటలు రాజేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి ఆగస్టు సంక్షోభం ఎదుర్కోక తప్పదంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ చేసిన కామెంట్స్‌.. దుమారం రేపుతున్నాయి.

బీజేపీ నేతల వ్యాఖ్యలకు అదేస్థాయిలో కౌంటర్‌ ఇస్తున్న కాంగ్రెస్‌నాయకులు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలతో రాబోయే రోజుల్లో తమ అసెంబ్లీబలం 90కి పెరుగుతుందంటున్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే పలుమార్లు పొలిటికల్‌ బాంబులు పేల్చిన బీఆర్‌ఎస్‌ నేతలు.. జాతీయ పార్టీలకు చెమటలు ఈ ఎన్నికల్లో పట్టించామంటోంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జూన్‌4 తర్వాత చూడాలంటున్నారు కేటీఆర్‌.

ఎవరి వెర్షన్‌ ఎలా ఉన్నా… స్టేట్‌ పాలిటిక్స్‌ను ఆగస్ట్‌ ఫీవర్‌ ఆగమాగం చేసేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…