Ex MLA Kunja Satyavathi: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే గుండె పోటుతో మృతి.. రాజకీయ నేతల సంతాపం
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గుంజ సరస్వతి (52) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం (అక్టోబర్ 15) ఇంట్లో ఉన్న సమయంలో సత్యవతికి గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. సత్యవతి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు..

భద్రాచలం, అక్టోబర్ 16: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గుంజ సరస్వతి (52) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం (అక్టోబర్ 15) ఇంట్లో ఉన్న సమయంలో సత్యవతికి గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. సత్యవతి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.
సత్యవతి మృతి పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. 2009- 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెతో పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడేవారని, ఏ చిన్న అవకాశం వచ్చిన ప్రజా సంక్షేమం విషయంలో తన గొంతుకని బలంగా వినిపించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనితీరును సత్యవతి ఎప్పటి కప్పుడు వివరించేవారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇంతలో ఇలాంటి దిగ్భ్రాంతికరమైన వార్తను వినాల్సి వచ్చిందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూనన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా సత్యవత మృతిపట్ల సంతాపం తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆమె స్వగృహం వద్దకు వెళ్లి పార్ధివదేహానికి నివాళులు అర్పించారు.
కుంజా సత్యవతి బీజేపీలో చురుకుగా పని చేస్తున్న నేత అని, సత్యవతి మృతి చెందడం పార్టీకి తీరని లోటని బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులతో పాటు భద్రాచలంలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు కూడా సత్యవతి మృతి ఆకస్మిక మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. భద్రాచలంలోని సత్యవతి స్వగృహంలో స్థానికులు, అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. కుంజా సత్యవతి భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్పార్టీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు శాసన సభ్యురాలుగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి పార్టీలో కీలక పాత్ర పోషించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.