AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana TDP: తెలంగాణలో పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ.. జనసేన, బీజేపీతో పొత్తు పొడిచేనా..?

Telangana Polls 2023: తెలంగాణ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలతో పాటు.. మరికొన్ని పార్టీలు కూడా బరిలోకి దిగుతుండటంతో.. మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల బరిలో.. టీడీపీ దిగేందుకు సిద్ధమైంది. 87 స్థానాల్లో పోటీకి టీటీడీపీ రెడీ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. టీడీపీ ఎన్నికల బరిలో ఉండదని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. వదంతులను నమ్మొద్దంటూ సూచించారు.

Telangana TDP: తెలంగాణలో పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ.. జనసేన, బీజేపీతో పొత్తు పొడిచేనా..?
TDP - Janasena - BJP Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Oct 16, 2023 | 9:38 PM

Share

Telangana Polls 2023: తెలంగాణ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలతో పాటు.. మరికొన్ని పార్టీలు కూడా బరిలోకి దిగుతుండటంతో.. మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల బరిలో.. టీడీపీ దిగేందుకు సిద్ధమైంది. 87 స్థానాల్లో పోటీకి టీటీడీపీ రెడీ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. టీడీపీ ఎన్నికల బరిలో ఉండదని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన.. వదంతులను నమ్మొద్దంటూ సూచించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బరిలో ఉంటుందని ఫుల్ క్లారిటీ ఇవ్వడంతోపాటు.. రాష్ట్రంలో టీడీపీ చాలా బలంగా ఉందంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారంటూ పేర్కొన్నారు. తెలుగుదేశం పోటీలో ఉంటుందన్న తరుణంలో.. తెలంగాణలో టీడీపీ పోటీ ఏ పార్టీకి లాభం..? ఏ పార్టీకి నష్టం..? తెలంగాణలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కుదిరేనా?

టీడీపీ, జనసేనల మధ్య… తెలంగాణలోనూ పొత్తు ఉంటుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇటీవల… రాజమండ్రిలో జనసేన అధ్యక్షుడు పవన్‌‌‌‌ కల్యాణ్‌‌ ఈ రెండు పార్టీల పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. అలానే.. తెలంగాణలోనూ టీడీపీ, జనసేన మధ్య పొత్తు దాదాపుగా కుదిరినట్లే అన్న అంచనాలున్నాయి. సీట్‌‌ షేరింగ్ మధ్య చర్చలు జరిగాల్సి ఉంది. అయితే… జనసేన ఇప్పటికే తెలంగాణలో 32 సీట్లు పోటీ చేస్తామని చెప్పడంతో పాటు… ఆయా స్థానాల జాబితాను ప్రకటించింది. తెలంగాణలో పొత్తు విషయమై.. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుగుతాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తుతో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక.. తెలంగాణలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే… ప్రచారం కూడా ఉంది. ఇదే సమయంలో నారా లోకేష్ ఢిల్లీలో… అమిత్ షాతో భేటీ అయిన సమయంలో… రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉండటంతో… తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి. కానీ.. పొత్తులపై ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వలేదు.

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో… బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ తప్పదని అంచనా వేస్తున్నారు. గ్రేటర్​హైదరాబాద్​తో పాటు ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం ఉండగా.. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్​పటిష్టంగా కనిపిస్తోంది. త్రిముఖ పోటీ ఉన్న చోట్ల.. మిగిలిన పార్టీలకు పోలయ్యే ఓట్లే… విజేతలను నిర్ణయించే పరిస్థితి నెలకొంది.

కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఓటు బ్యాంకు..

తెలుగు దేశం పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉన్నది. జీహెచ్ఎంసీ, ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లలో ఎక్కువ మంది ఆంధ్రా సెటిలర్లే. కొన్నేళ్ల నుంచి… వీరు టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు… 3వేల నుంచి 5 వేల ఓట్లు తెచ్చుకున్నారు. టీడీపీ అభిమానులు చాలా వరకు… ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్లిపోయినా.. ఇంకా కొంత మంది అదే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఎన్నికల బరిలో టీడీపీ దిగుతుండటంతో.. ఆ పార్టీ ఓటు బ్యాంకు.. ఆయా సామాజికివర్గం ఓట్లు.. ఏ ప్రధాన పార్టీకి లాభం చేరుస్తాయో.. ఏ పార్టీకి నష్టం చేరుస్తాయోనని… ఆయా పార్టీలో.. హైటెన్షన్‌ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..