Betting Apps Case: పాకిస్తాన్ వెళ్లిపోయాడా..? సన్నీయాదవ్‌పై లుకౌట్ నోటీసులు జారీ..
భయ్యా.. ఎక్కడున్నావయ్యా..? సోషల్ మీడియాలో ఇప్పుడిదే హ్యాష్ ట్యాగ్ రన్ అవుతోంది..! బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిలో ఫస్ట్ కేసు భయ్యా సన్నీ యాదవ్‌పైనే నమోదయినప్పటికీ.. ఇప్పటివరకూ అతగాడు ఎక్కడున్నాడన్న ఇన్ఫర్మేషన్ లేదు. బైక్‌పై ప్రపంచాన్ని చుట్టేస్తూ వ్లాగ్స్ చేసే సన్నీ యాదవ్... అదే బైక్‌పై భారత్ బోర్డర్ దాటేసినట్లు తెలుస్తోంది..

భయ్యా.. ఎక్కడున్నావయ్యా..? సోషల్ మీడియాలో ఇప్పుడిదే హ్యాష్ ట్యాగ్ రన్ అవుతోంది..! బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిలో ఫస్ట్ కేసు భయ్యా సన్నీ యాదవ్‌పైనే నమోదయినప్పటికీ.. ఇప్పటివరకూ అతగాడు ఎక్కడున్నాడన్న ఇన్ఫర్మేషన్ లేదు. బైక్‌పై ప్రపంచాన్ని చుట్టేస్తూ వ్లాగ్స్ చేసే సన్నీ యాదవ్… అదే బైక్‌పై భారత్ బోర్డర్ దాటేసినట్లు తెలుస్తోంది.. పాకిస్తాన్ వెళ్లాడన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి సన్నీ ఇండియాకు వస్తాడా? రాడా..? లేదంటే ఇప్పటికే లుకౌట్ నోటీసులిచ్చిన పోలీసులు.. రెడ్‌కార్నర్ నోటీసులిచ్చి రప్పిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
భయ్యా సన్నీ యాదవ్… ఫేమస్ మోటో వ్లాగర్. తన స్పోర్ట్స్ బైక్‌పై ప్రపంచంలోని ప్రదేశాలను చుట్టేస్తూ వీడియోస్ చేయడం మనోడి స్పెషాలిటీ. ఉమ్మడి నల్గొండ జిల్లా నూతనకల్‌కు చెందిన సన్నీ యాదవ్‌కు యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌తోనే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడు. చిక్కులు కొని తెచ్చుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ బాగోతం బయటకు రాగానే ఫస్ట్ సన్నీ యాదవ్‌పైనే కేసు నమోదైంది. దీంతో పోలీసులు నోటీసులిచ్చారూ.. విచారణకూ రమ్మన్నారు. కానీ సన్నీ యాదవ్ మాత్రం ఆబ్సెంట్. అసలెక్కడ ఈ మోటో వ్లాగర్ అనంటే..! మాకేం తెలుసంటున్నారు స్నేహితుడు. మీకేమైనా తెలుసా అని పేరెంట్స్‌ని అడిగితే అమెరికాలో ఉన్నాడని చెబుతున్నారు..! ఇంకొందరేమో.. న్యూజిలాండ్, ఐర్లాండ్ అనేస్తున్నారు. కానీ సన్నీ పాకిస్తాన్‌లో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.
సన్నీ యాదవ్‌పై మార్చి 5నే సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణకు రావాలంటూ పోలీసులు కూడా నోటీసులిచ్చారు. అయితే ముందస్తు బెయిల్ కోసం సన్నీయాదవ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇక సన్నీ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి వాదనలను మార్చి 24న విననుంది. ఇంతలో సన్నీ యాదవ్‌కు షాకిస్తూ.. లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఇండియాలోనే లేని అతడ్ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సన్నీ పాకిస్తాన్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. బైక్‌తో ప్రపంచాన్ని చుట్టే సన్నీ.. అదే బైక్‌పై వాఘా బోర్డర్ మీదుగా పాక్ వెళ్లినట్లు పలువురి ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందినట్లు తెలుస్తోంది. అసలు సన్నీ యాదవ్ పాక్ ఎలా వెళ్లాడు..? కేసులకు భయపడే వెళ్లాడా..? లేదంటే వ్లాగ్స్ కోసం వెళ్లాడా..? అంటూ విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. అటు నూతనకల్ నుంచి మొదలుపెట్టి.. ఇటు హైదరాబాద్ వరకూ సన్నీపై కూపీ లాగుతున్నారు.
మొత్తంగా.. ఉచ్చు బిగుస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఫస్ట్ క్యాండిడేట్‌గా సన్నీ యాదవ్ నిజంగానే పాక్ వెళ్లాడా.? వెళ్తే ఎప్పుడొస్తాడు..? లేదంటే పోలీసులే రెడ్ కార్నర్ నోటీసులిచ్చి వెల్‌కమ్ చెబుతారా..? అసలు సన్నీ యాదవ్ కేసులో నెక్ట్స్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..