Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు.. క్షణక్షణం.. భయం… భయం

శాతవాహన యూనివర్శిటీ ప్రాంగణంలో ఇంతకీ ఎలుగుబంటి ఒకటే ఉందా..? లేక మరిన్ని ఉన్నాయా..? ఫారెస్టు సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌ బంటి సక్సెస్‌ అవుతుందా..? బోరు బావుల దగ్గర ఏర్పాటు చేసిన బోనులో బియర్‌ చిక్కుతుందా..?

Karimnagar:  శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు.. క్షణక్షణం.. భయం... భయం
Bear
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 12, 2022 | 10:09 AM

Satavahana University: శాతవాహన యూనివర్శిటీ ఏరియాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. వర్శిటీ సిబ్బంది సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. యూనివర్శిటీలో వెనుక ఉన్న చిట్టడవిలో రెండు పెద్దబావుల వద్దకు నీటికోసం ఎలుగుబంట్లు వస్తాయని భావిస్తున్నారు. భల్లూకాన్ని బోనులో బంధించేందుకు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు.  యూనివర్శీటీలోని ఏయే ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందో అటవీశాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటి అడుగుజాడలను గుర్తించారు. పలుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. బోనులో భల్లూకానికి ఇష్టమైన అరటిపళ్ల గెలలను ఉంచారు. చెట్లు, పొదలు దట్టంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. పక్కనే ఉన్న కొండల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. విద్యార్థులు, వాకర్స్‌ అటువైపు వెళ్లొద్దని సూచించారు.

యూనివర్శిటీ ప్రాంగణంలో ఒకటే ఎలుగుబంటి ఉందా..? లేక మరిన్ని ఉన్నాయా..?

ఇంతకీ శాతవాహన యూనివర్శిటీ ప్రాంగణంలో ఒకటే ఎలుగుబంటి ఉందా..? లేక మరిన్ని ఉన్నాయా..? అనే కోణంలోనూ కూడా ఫారెస్టు సిబ్బంది దృష్టి పెట్టారు. భల్లూకాన్ని త్వరలో బంధిస్తామని…ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే రెండు ఎలుగుబంట్ల జాడలు కనిపించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒకటి కాదు…రెండు కాదు…తనకు మూడు ఎలుగుబంట్లు కనిపించినట్లు ఓ విద్యార్థిని భయంతో చెబుతోంది. మొత్తానికి ఆపరేషన్‌ బంటి కొనసాగుతోంది. అయితే యూనివర్శిటీ ప్రాంగణంలోకి ఎలుగుబంటి ఎలా వచ్చిందనే కోణంపై ప్రధానంగా దృష్టి సారించారు ఫారెస్టు అధికారులు.

Also Read: Viral: ఉత్త రంగురాళ్లేమో అనుకున్నారు.. ల్యాబ్‌కి పంపి టెస్ట్ చేయిస్తే మైండ్ బ్లాంక్

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!