AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Biryani: మీరూ హైదరాబాద్‌ బిర్యానీ తింటున్నారా? మీ ప్రాణాలకి గ్యారెంటీ లేనట్లే..! ఎందుకో తెలుసా..

ఆదివారం వచ్చిందంటే చాలు.. అందరికీ నాన్ వెజ్ కావాల్సిందే. ముఖ్యంగా బిర్యానీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. రోజూ ఉండే బిజీబిజీ లైఫ్ పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి మంచి ఫుడ్ తినాలని చాలా మంది అనుకుంటారు. అలా కొంతమంది బయటికి వెళ్లి తింటుంటే, మరికొందరు ఇళ్లలోనే వేడివేడిగా బిర్యానీ చేసుకుని ఆరగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే బాస్మతి రైస్ తీసుకొచ్చి నచ్చిన రీతిలో వండుకుని రుచులు ఇస్వాదిస్తూ..

Hyderabad Biryani: మీరూ హైదరాబాద్‌ బిర్యానీ తింటున్నారా? మీ ప్రాణాలకి గ్యారెంటీ లేనట్లే..! ఎందుకో తెలుసా..
Hyderabad Biryani
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 28, 2024 | 5:51 PM

Share

హైదరాబాద్‌, మే 28: ఆదివారం వచ్చిందంటే చాలు.. అందరికీ నాన్ వెజ్ కావాల్సిందే. ముఖ్యంగా బిర్యానీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. రోజూ ఉండే బిజీబిజీ లైఫ్ పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి మంచి ఫుడ్ తినాలని చాలా మంది అనుకుంటారు. అలా కొంతమంది బయటికి వెళ్లి తింటుంటే, మరికొందరు ఇళ్లలోనే వేడివేడిగా బిర్యానీ చేసుకుని ఆరగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే బాస్మతి రైస్ తీసుకొచ్చి నచ్చిన రీతిలో వండుకుని రుచులు ఇస్వాదిస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో దొరికే బాస్మతీ రైస్‌ మంచిదేనా? రోగ్యానికి ఏమైనా హాని చేస్తుందా అని ఒక్కసారైనా ఆలోచించారా? అవును.. ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో ఇష్టం తింటున్న బాస్మతీ రైస్‌ నకిలీదా? అసలైనదా? అని గుర్తించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు.

బిర్యానీ.. హైదరాబాద్ మహా నగరానికి పెట్టింది పేరు. ఇక్కడ వందల కొద్దీ హోటళ్లు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున బాస్మతి బియ్యం కొనుగోలు చేస్తుంటారు. వీటిని వండి వార్చి.. నగరం అంతా పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వడ్డిస్తుంటారు. సాధారణంగా బాస్మతి బియ్యానికి ఒక రకమైన గులాబీ పూల వాసన వస్తుంది. వేడిగా తింటుంటే.. ఆ వాసన మనకు ఇంకా మంచి రుచిని అందించి ఇంకాస్త ఎక్కువ తినేలా చేస్తుంది. కానీ, ఇప్పుడు అదే మన పాలిట శాపంగా మారనుంది. ప్రస్తుతం చాలా చోట్ల రసాయనాల ద్వారా పండిస్తున్న బాస్మతి బియ్యం విక్రయిస్తున్నారు. ఈ బియ్యంలో అలాంటి పూల వాసన రావడం లేదు.

దీంతో సహజంగా పండించిన బియ్యం మాదిరి మంచి వాసన కోసం బాస్మతి బియ్యంలో అత్యంత ప్రమాదకరమైన లిక్విడ్స్ కలుపుతున్నారు. ఈ లిక్విడ్ కలపడం వల్ల అది ఒరిజినల్ బాస్మతి బియ్యంలా సువాసనలు వెదజల్లుతుంది. చూడటానికి అచ్చం బాస్మతీ బియ్యం లాగే ఉండటం మాత్రమేకాకుండా.. రుచి కూడా అదే మాదిరి ఉంటుంది. దాంతో మనం ఏది సరైనదో.. కాదో.. తెలుసుకోలేకపోతున్నాం. హైదరాబాద్ నగరంలోని చాలా వరకు హోటళ్లలో ఇదే పరిస్థితి. అవగాహన లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన బాస్మతీ రైస్‌ తింటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి బిర్యానీ తిని ప్రజలు చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. వారిలో కొందరికి ఏకంగా ప్రాణాల మీదికొచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో కూడా అవగాహన కల్పించి కట్టడి చేయాలని అధికారులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!