కరీంనగర్‌లో అయోధ్య రామాలయ సైకత శిల్పం.. వీడియో వైరల్.!
దేశమంతా రామనామం స్మరిస్తోంది. ఆధ్యాత్మిక ఘటాన్నికి సమయం ఆసన్నమైంది. ఒకవైపు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతోన్న తరుణంలో.. మరోవైపు కరీంనగర్‌లో అయోధ్య రామాలయాన్ని పోలిన సైకత ఆలయం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
దేశమంతా రామనామం స్మరిస్తోంది. ఆధ్యాత్మిక ఘటాన్నికి సమయం ఆసన్నమైంది. ఒకవైపు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతోన్న తరుణంలో.. మరోవైపు కరీంనగర్‌లో అయోధ్య రామాలయాన్ని పోలిన సైకత ఆలయం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానికులు ఈ మందిరాన్ని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఇదిలా ఉంటే.. అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సాయంత్రం ప్రతి ఒక్క ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు బండి.