ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన శక్తివంతమైన పేలుడుపదార్థం (ఐఇడి) పేలడంతో ఎఎస్‌పి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అధికారులు సహా పలువురు సిబ్బందికి గాయాలైనట్టుగా తెలిసింది. గాయపడిన వారిని కొంటా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.. సుక్మా జిల్లాలోని కొంట.. ఎర్రబోరు రోడ్డు లో దొండ్రా గ్రామ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఏ ఎస్పీ ఆకాష్ రావు, డీఎస్పీ, సిఐ తన సిబ్బందితో కలిసి వెళ్ళారు..అప్పటికే భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ.. మాటు వేసిన మావోయిస్టులు పోలీసుల వాహనాన్ని ఐ ఈడి తో పేల్చివేశారు. ఘటన లో ఏ ఎస్పీ తో పాటు భద్రతా బలగాలు తీవ్రంగా గాయపడ్డారు.. అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు..అప్పటికే ఏ ఎస్పీ మృతి చెందారు..మిగిలిన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దాడి కోసమే మావోయిస్టులు భద్రతా బలగాలను ఉచ్చులోకి లాగారా? అనే అనుమానం కలుగుతోంది..గత కొద్ది నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు..అగ్ర నేతలు నంబాల కేశవరావు, సుదర్శన్ , ఆడేళ్లు వంటి నేతలు మృతి చెందారు..దీనితో జూన్ 10 న మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చారు.. నిన్న చిక్వార్ గూడా వద్ద ప్రొక్లేయిన్ ను దహనం చేశారు.. ఈ క్రమంలోనే సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు గానూ.. ఏఎస్పీ సహా ఇతర సిబ్బంది పోలీస్ వాహనంలో బయల్దేరారు.
పోలీసులు టార్గెట్ గా మావోయిస్టులు ముందుగానే మందుపాతర ఏర్పాటు చేశారు. అదును చూసి దాన్ని పేల్చేశారు. మందుపాతర పేలుడుతో పోలీసులంతా తీవ్రంగా గాయపడ్డారు.. బస్తర్ డివిజన్ లో మావోయిస్టులు కార్యకలాపాలను కట్టడి చేయడానికి వేలాది మంది భద్రతా బలగాలు గత కొన్ని నెలలుగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి..వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది.. దీంతో ఆత్మరక్షణ లో పడిన మావోయిస్టులు ప్రతీకారంతో ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు, పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఛత్తీస్ ఘడ్,ఏపి , తెలంగాణ సరిహద్దు లో హై అలెర్ట్ నెలకొంది..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…