Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Prasadam 2025: చేప ప్రసాదం అంటే ఏమిటో తెలుసా..? మొదట్లో ఎక్కడ పంపిణీ చేసేవారంటే..

చేప ప్రసాదం తినడం వల్ల ఆస్తమా, ఉబ్బసం వంటి రోగాలు నయమవుతాయని గత కొన్నేళ్లుగా ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అంతేకాదు.. ప్రతి ఏటా చేప మందు కోసం వచ్చే రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఏర్పాట్లు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. చేప మందు కోసం వచ్చే వారికి కావాల్సిన అల్పాహారం, భోజనం, తాగునీరు సమకూరుస్తున్నాయి. అయితే, ఇంతకీ ఈ చేప ప్రసాదం అంటే ఏంటో తెలుసా..?

Fish Prasadam 2025: చేప ప్రసాదం అంటే ఏమిటో తెలుసా..? మొదట్లో ఎక్కడ పంపిణీ చేసేవారంటే..
Fish Prasadam 2
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2025 | 1:33 PM

మృగశిర కార్తె.. జ్యోతిశాస్త్రం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్నే మృగశిర కార్తె అంటారు. తెలుగు ప్రజలు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ కాలంలో వర్షాలు మొదలై, వాతావరణం చల్లబడుతుంది. రైతులు ఈ సమయంలో పొలాలు దున్ని, పంటలు వేయడం ప్రారంభిస్తారు. అయితే మృగశిర కార్తె అనగానే చాలా మందికి హైదరాబాద్‌లో బత్తిన వంశస్థులు పంపిణీ చేసే చేప ప్రసాదం గుర్తుకువస్తుంది. చేప ప్రసాదం తినడం వల్ల ఆస్తమా, ఉబ్బసం వంటి రోగాలు నయమవుతాయని గత కొన్నేళ్లుగా ప్రజలు నమ్ముతూ వస్తున్నారు. అంతేకాదు.. ప్రతి ఏటా చేప మందు కోసం వచ్చే రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఏర్పాట్లు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. చేప మందు కోసం వచ్చే వారికి కావాల్సిన అల్పాహారం, భోజనం, తాగునీరు సమకూరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. రవాణా సమస్యలు రాకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. రోగులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చేప మందు పంపిణీకి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. అయితే, ఇంతకీ ఈ చేప ప్రసాదం అంటే ఏంటో తెలుసా..?

చేప ప్రసాదం అనేది ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక మందు. ఆస్తమా, ఉబ్బసం, దగ్గుదమ్ము వంటి శ్వాసకోశ సమస్యలకు బత్తిని సోదరులు ప్రత్యేకంగా తయారు చేసి, ఉచితంగా బాధితులకు పంపిణీ చేస్తారు. ఇందులో కొర్రమీను చేపలు, బెల్లం, మూలికలు ఉంటాయని సమాచారం. 170 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కాగా, మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ ఏడాది జూన్ 8, 9 తేదీల్లో ఉచితంగా పంపిణీ చేస్తారు.

అయితే, గతంలో హైదరాబాద్‌లోని పాతబస్తీలో మొదట్లో ఈ చేప మందు పంపిణీ చేసేవారట. భద్రతా కారణాల వల్ల దీనిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్చారు. రోగులు ఒకటి రెండు రోజుల ముందుగానే గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ స్టాల్స్‌లో కొర్రమీను చేప పిల్లలను విక్రయిస్తారు. చేప ప్రసాదం కోసం డబ్బులిచ్చి చేప పిల్లలను కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఈ ప్రసాదం ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత