AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

పిల్లల నుంచి పెద్దల వరకు పాలు అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం. పాల ఉత్పత్తులు మన రోజూ వారి ఆహార పదార్ధాలలో విరివిగా వాడుతుంటాం. మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్​, పాలలో పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ పాలలోని బయో యాక్టివ్ పదార్థం బాడీలో కొవ్వును కరిగేలా చేస్తుంది. పాలు రోజూ తాగడం వల్ల ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పాలలో ఖర్జూరాలను కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసా..?

Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Milk With Dates
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2025 | 12:57 PM

Share

శరీరంలో ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరిగా అవసరం. అంతేకాదు.. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కాల్షియం తప్పనిసరి. వయసుకు తగినట్లుగా కండరాలు కదలడానికి, ఎముకల సాంద్రతను, వాటిలో బలాన్ని కాపాడడంలోనూ కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మీ మెదడు నుంచి శరీరంలోని ప్రతి భాగానికి సందేశాలను తీసుకువెళ్లడానికి నరాలకు కాల్షియం అవసరం. రక్త నాళాలు మీ శరీరం అంతటా రక్తాన్ని తరలించడంలో కాల్షియం సహాయపడుతుంది, మీ శరీరంలోని అనేక విధులను ప్రభావితం చేసే హార్మోన్లను విడుదల చేయడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాల్షియం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలేంటో తెలుసుకోవటం తప్పనిసరి అంటున్నాన్నారు ఆరోగ్య నిపుణులు. పాలు, ఖర్జూరంలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే….

మీరు తరచుగా జీర్ణ సమస్యతో బాధపడుతుంటే, రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగండి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డతాయి. ఖర్జూరం పాలు తాగడం వల్ల నిద్రలేమికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో ఐరన్, విటమిన్ సి, డి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

బరువు పెరగాలనుకునే వారు ఖర్జూరాలను పాలలో నానబెట్టి, రాత్రి పడుకునే ముందు తాగడం మంచిది. ఖర్జూరంలో కేలరీలు, పోషకాలు అధికంగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి తోడ్పడతాయి. పాలలో ఖర్జూరం కలపడం వల్ల కండరాలకు మంచి పోషకాలు అందుతాయి. ఖర్జూరంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్ కండరాల నిర్మాణానికి, దృఢంగా ఉండటానికి సహాయపడుతాయి. బిపిని నియంత్రించడానికి పాలలో ఖర్జూరం కలిపి తాగండి. ఎందుకంటే వాటిలో మంచి పొటాషియం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!