AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది మామూలు ఆకు కాదు భయ్యా.. వందల రోగాలకు చెక్‌పెట్టే దివ్యౌషధం..!

మున‌గాకుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. దీంతో ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీంతో ఈజీగా బ‌రువు తగ్గుతారు. అంతేకాదు.. మునగాకు వాడకంతో కొవ్వు క‌ణాలు సుల‌భంగా క‌రిగిపోతాయి. ఏదో ఒక రూపంలో తరచూ మున‌గాకుల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌, శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి డిటాక్స్ అవుతాయి. దీంతో లివర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

ఇది మామూలు ఆకు కాదు భయ్యా.. వందల రోగాలకు చెక్‌పెట్టే దివ్యౌషధం..!
Moringa Powder Health Benefits
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2025 | 11:51 AM

Share

మునగ చేసే మేలు దాదాపు అందరికీ తెలిసిందే.! చాలా మంది మునగ కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మునగ కాయలతో పప్పు, సాంబార్‌, కూరలు తయారు చేస్తుంటారు. మునగలోని ఔషధ గుణాలు, పోషకాల వల్ల 300లకు పైగా రోగాలను అంతం చేసే శక్తి ఉందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మునగ ఆకులతో కూడా అంతే ప్రయోజనం ఉంటుందని మీకు తెలుసా..? తరచూ మునగాకు మీ ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. మునగాకులో ఏ, బీ, సీ విటమిన్‌లుంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్‌… మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ కూడా ఉంటాయి. తరచూ తింటే చాలా మంచిది. రోజూ కూరల్లో వేసుకుంటే ఇంకా మంచిది.

విటమిన్ C అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో సాధార‌ణ ద‌గ్గు, జ‌లుబు నుంచి, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కంటి చూపు మెరుగుపరచుకోవడానికి.. ఎప్పటికి సైట్ రాకుండా ఉండడానికి కూడా ఈ ఆకు ఎంతో ఉపయోగపడుతుంది. మున‌గాకుల్లో అధిక మొత్తంలో క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలోని ఎముక‌లు, దంతాల‌కు ఎంతో మేలు చేస్తాయి. మున‌గాకు రోజూ తిన‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా మారుతాయి. మున‌గాకుల్లో ఉండే, అనేక స‌మ్మేళ‌నాలు మీలో కొలెస్ట్రాల్‌ను, బీపీని త‌గ్గిస్తాయి. మున‌గాకుల్లో పొటాషియం, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. కండ‌రాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఐరన్ కంటెంట్ అధికంగా ఉండి హీమోగ్లోబిన్ పెంచుతుంది.

రోజు మునగాకు తినడం వల్ల.. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. కాల్షియం అధికంగా ఉండి ఎముకలకు బలం కలిగిస్తుంది. వారానికి కనీసం మూడుసార్లు మునగాకు కూరను ఆహారంగా తీసుకోండి. ఇది సహజ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మున‌గాకుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. దీంతో ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీంతో ఈజీగా బ‌రువు తగ్గుతారు. అంతేకాదు.. మునగాకు వాడకంతో కొవ్వు క‌ణాలు సుల‌భంగా క‌రిగిపోతాయి. ఏదో ఒక రూపంలో తరచూ మున‌గాకుల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌, శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోయి డిటాక్స్ అవుతాయి. దీంతో లివర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ తోపు.. కానీ బౌలింగ్ చూస్తేనే భయం వేస్తోంది
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ తోపు.. కానీ బౌలింగ్ చూస్తేనే భయం వేస్తోంది
ఓటీటీలో 'దృశ్యం' దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 'దృశ్యం' దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
మగధీర మూవీలో చిరంజీవికి డూప్‌గా నటించింది ఎవరో తెల్సా
మగధీర మూవీలో చిరంజీవికి డూప్‌గా నటించింది ఎవరో తెల్సా
దేవుడి ఫొటోలు ఎప్పుడు కడగాలి..? 99శాతం మంది చేసే తప్పులివే..
దేవుడి ఫొటోలు ఎప్పుడు కడగాలి..? 99శాతం మంది చేసే తప్పులివే..
బంగారం ధరలపై సంచలనం.. త్వరలో రూ.11 లక్షలకు..
బంగారం ధరలపై సంచలనం.. త్వరలో రూ.11 లక్షలకు..