AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Apple: ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

రోజ్ యాపిల్..దీనినే వాటర్ యాపిల్‌ అని కూడా పిలుస్తారు. పేరు వినగానే ఏదో యాపిల్ పండులా ఉంటుందనుకునేరు... కానీ ఇది మన జామకాయల జాతికి చెందిన స్పెషల్ ఫ్రూట్‌ అంటున్నారు పోషకాహార నిపుణులు. చూడడానికి మంచి రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక రుచిలో కూడా అంతే మధురంగా ఉంటుంది. కేవలం రంగు, రుచి మాత్రమే కాదు.. రోజ్‌ యాపిల్‌ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అమృత ఫలం అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Rose Apple: ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!
Rose Apple
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2025 | 6:33 PM

Share

ఈ అరుదైన రోజ్‌ యాపిల్‌ గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో గుండెకు కావలసిన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, సోడియం వంటివి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తరచూ రోజ్‌ యాపిల్‌ తీసుకోవటం వల్ల గుండెపోటు, బీపీ, పక్షవాతం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు..రోజ్ యాపిల్‌లో జాంబోసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాదు.. ఈ పండులోని గుణాలు గ్లూకోజ్ వినియోగాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుందని చెబుతున్నారు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది.

ఇందులో విటమిన్ C రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్,బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. నీటి శాతం అధికంగా ఉండటం డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. తరచూ ఈ పండును మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రోజ్‌ యాపిల్‌ జీర్ణ వ్యవస్థ మెరుగు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండు మలబద్ధకం, గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గించేస్తుంది. రోజ్ యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన చర్మం కాంతివంతంగా, యవ్వనంగా, మెరిసేలా ఉంచుతుంది.

రోజ్‌ యాపిల్‌ కెలొరీలు తక్కువగా, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ఎ, బి, సిలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. రోజ్‌ యాపిల్‌లోని నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..