AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mulberry: మల్బరీ పండు గురించిన మతిపోయే నిజాలు.. తెలిస్తే వామ్మో అనాల్సిందే..!

ఈ రెండు పోషకాలు మల్బరీలో ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఎముకలు బలహీనపడకుండా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మల్బరీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి లభిస్తాయి. ఈ రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ వేసవి పండ్లు ఎక్కడ కనిపించినా వదలకుండా తినమని నిపుణులు సూచిస్తున్నారు.

Mulberry: మల్బరీ పండు గురించిన మతిపోయే నిజాలు.. తెలిస్తే వామ్మో అనాల్సిందే..!
Mulberry
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2025 | 5:47 PM

Share

మల్బరీ..ఈ వేసవి పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి..ఈ పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు… ఇందులో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మల్బరీ పండ్లు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. మల్బరీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మల్బరీ తినడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటితో పోరాడటానికి, నివారించడంలో సహాయపడుతుంది. మల్బరీ పండ్లలో విటమిన్ C, విటమిన్ K, ఐరన్, కాల్షియం, పొటాషియం ఉంటాయి.

మల్బరీ పండు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మల్బరీ పండులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఈ పండులో పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారికి ఉపయోగపడుతుంది. మల్బరీ ఆకు పొడి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మల్బరీ పండులోని డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీ వస్తే వైద్య సలహా తీసుకోవాలి. ఈ పండును నేరుగా తినవచ్చు. ఆకుతో కషాయం పెట్టుకోవచ్చు.

మల్బరీ పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ముడతలు పడడాన్ని తగ్గిస్తుంది. చూసేందుకు మల్బరీస్ చిన్నగా కనిపించినప్పటికీ, మీ బరువును తగ్గించడంలో గొప్ప మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎముకల బలానికి ఐరన్, కాల్షియం చాలా ముఖ్యమైనవి. ఈ రెండు పోషకాలు మల్బరీలో ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఎముకలు బలహీనపడకుండా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మల్బరీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి లభిస్తాయి. ఈ రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ వేసవి పండ్లు ఎక్కడ కనిపించినా వదలకుండా తినమని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..