Amla Juice: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..!
చాలామందిలో జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోతూ వస్తోంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వల్ల చదువుకున్నది మొత్తం మర్చిపోతుంటారు. కొంతమంది పిల్లలు అయితే గంట ముందు చదివింది కూడా ఇప్పుడు గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. దీనికి కారణం జ్ఞాపకశక్తి తగ్గడమేనని అంటున్నారు నిపుణులు. జ్ఞాపకశక్తి తగ్గడం వల్ల కొంతమందిలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి చాలామంది రసాయనాలతో కూడిన కొన్ని సూపర్ డ్రింక్స్ వాడుతుంటారు. కానీ, అవేవీ మంచివి కాదని, పైగా కెమికల్ ఆధారిత ఉత్పత్తులు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని అంటున్నారు. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, మెదడును మెరుగుపరిచేందుకు ఉసిరికాయ రెమిడి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5