- Telugu News Photo Gallery Cinema photos I got a chance to sing because of my father kamal haasan says Shruti Haasan
Shruti Haasan: ఆయన వల్లే నాకు ఆ అదృష్టం దక్కిందంటున్న శ్రుతిహాసన్
ప్రపంచంలో ఎంత మందికి ఈ అదృష్టం దక్కుతుందో తెలియదు కానీ, నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నా అని అంటున్నారు శ్రుతిహాసన్. నన్ను ఇష్టపడే వాళ్లే కాదు.. ఇష్టపడని వాళ్లు కూడా మెసేజ్‌లు చేస్తున్నారంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇంతకీ విషయమేంటి? కమల్‌హాసన్ నటించిన థగ్ లైఫ్‌లో విన్ వెలి నాయకా అంటూ పాట పాడారు శ్రుతి హాసన్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jun 07, 2025 | 3:32 PM

కమల్‌హాసన్ నటించిన థగ్ లైఫ్‌లో విన్ వెలి నాయకా అంటూ పాట పాడారు శ్రుతి హాసన్. థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఆ పాటను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేశారు. అప్పటి నుంచి ఇంకా ఇంకా మెసేజ్‌ల వెల్లువ ఆగడం లేదంటున్నారు శ్రుతి.

తండ్రికి సంగీతం చేసే అదృష్టం, తండ్రి సినిమాకు పాట పాడే అదృష్టం ఎంత మంది కూతుళ్లకు దక్కిందో నాకు తెలియదు కానీ, నేను మాత్రం జీవిత సాఫల్యంగా భావిస్తున్నానని చెప్పారు శ్రుతిహాసన్.

ఈనాడు సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత మా నాన్న కోసం నేను పనిచేయడం ఆనందంగా ఉంది. రీసెంట్‌గా ఇనిమేల్ వీడియో ఆల్బమ్ కోసం నాన్నతో పనిచేశాను.

మళ్లీ ఇప్పుడు సినిమాకోసం వర్క్ చేశాను. నేనంటే గిట్టని వాళ్లు కూడా నా పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయి మెసేజ్‌లు చేస్తున్నారని చెప్పారు శ్రుతి. కమల్‌హాసన్‌తో పనిచేసిన థగ్‌లైఫ్‌ఈ ఏడాదే విడుదలైంది.

రజనీకాంత్‌తో వర్క్ చేసిన కూలీ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఒకే ఏడాది ఇద్దరు లెజండరీ నటులతో అసోసియేట్ అయ్యే అరుదైన అవకాశం కూడా తనకు దక్కిందంటున్నారు శ్రుతి.



















