ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన నేతకు జాక్‌పాట్..! జీవితంలో మర్చిపోలేని రోజంటూ ఆయన భావోద్వేగం..
తెలంగాణ కొత్త మంత్రులు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ సారథ్యంలో అన్ని వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు.. మాదిగ సామాజికవర్గం తరపున కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అడ్లూరి లక్ష్మణ్.

మంత్రివర్గంలో స్థానం దక్కడంపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గంలో స్థానం దక్కడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇది జీవితంలో మరిచిపోలేని రోజుగా భావిస్తున్నానని.. తన లాంటి సామాన్య కార్యకర్తకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం అదృష్టం అన్నారు. సీఎం రేవంత్ సారథ్యంలో అన్ని వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు.. మాదిగ సామాజికవర్గం తరపున కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అడ్లూరి లక్ష్మణ్.
తెలంగాణ కొత్త మంత్రులు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..